దుమ్మురేపుతున్న భీష్మ: అక్కడా, ఇక్కడా అనే తేడానే లేదు.. వసూళ్ల ప్రవాహమే.. | Bheeshma Overseas Collections Report

Collections


కుమ్మేసిన భీష్మ.. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే

కుమ్మేసిన భీష్మ.. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే

భీష్మ సినిమా తొలి రోజే దాదాపు 6.28కోట్లను కొల్లగొట్టింది. నైజాంలో 2.2కోట్లు, సీడెడ్‌లో 0.8కోట్లు, వైజాగ్‌లో 0.62కోట్లు, గుంటూరు 0.77కోట్లు, ఈస్ట్ 0.66కోట్లు, వెస్ట్ 0.56కోట్లు, కృష్ణా 0.4కోట్లు, నెల్లూరు 0.27కోట్లు రాబట్టడమే గాక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ఇలా ఈ లెక్కలన్నీ కలిసి మొత్తంగా మొదటి రోజు 8కోట్లకు పైగా రాబట్టింది.

రెండో రోజూ అదే స్పీడ్..

రెండో రోజూ అదే స్పీడ్..

మొదటే రోజే సినిమాకు పాజిటివ్ టాక్‌ రావడంతో రెండో రోజూ అదే స్పీడ్ కొనసాగింది. పైగా శివరాత్రి, వీకెండ్ ఇలా అన్నీ కలసి రావడం భీష్మకు ప్లస్ అయింది. దీంతో మొదటి రోజు వసూళ్లకు ధీటుగా రెండో రోజూ దాదాపు 8.10కోట్లు కొల్లగొట్టింది భీష్మ మూవీ.

బ్రేక్ ఈవెన్‌ స్పాట్.. ఇంతలోనే

బ్రేక్ ఈవెన్‌ స్పాట్.. ఇంతలోనే

భీష్మ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజుల్లోనే భీష్మ 12.80కోట్ల షేర్‌ను, 19.30కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్టు తెలుస్తోంది. భీష్మ చిత్రం దాదాపు 23కోట్లకు అమ్ముడు పోగా.. 25కోట్ల షేర్‌ను రాబట్టే టార్గెట్‌తో దిగింది. రెండో రోజుతోనే దాదాపు సగం రాబట్టేసింది. ఇదే రోజును కొనసాగిస్తే మరో రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఖాయం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

అక్కడా, ఇక్కడా అనే తేడానే లేదు..

అక్కడా, ఇక్కడా అనే తేడానే లేదు..

అక్కడా, ఇక్కడా అనే తేడానే లేకుండా అన్ని ఏరియాల్లో సత్తా చాటుతోంది భీష్మ. దేశంలోనే గాక ఓవర్సీస్ మార్కెట్ లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ 500K డాలర్స్ వసూళ్లు రాబట్టి 1 మిలియన్ డాలర్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Bheeshma Movie Public Talk | Venky Kudumula | Nithin | Rashmika Mandanna | Filmibeat Telugu

సంబరాల్లో చిత్రయూనిట్

సంబరాల్లో చిత్రయూనిట్

భీష్మ అనుకున్న రేంజ్ సక్సెస్ సాధించడంతో చిత్ర యూనిట్ అంతా ఖుషీగా ఉంది. నితిన్, రష్మిక మందన్న సహా చిత్ర నిర్మాతలు ఆనందంలో మునిగితేలుతున్నారు.Source link

telugu.filmibeat.com

Leave a Reply