భాగీ3 మూవీకి కోలుకోని దెబ్బ.. కండలు కరిగించినా కష్టంగా కలెక్షన్లు | Baaghi 3 movie day 4 collections: Racing towards 100 crores

Collections


కరోనా వైరస్ దెబ్బకు

కరోనా వైరస్ దెబ్బకు

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభించడం భాగీ సినిమా వసూళ్లపై భారీగానే ప్రభావం పడింది. రూ.20 నుంచి రూ.25 కోట్ల మధ్య లక్ష్యంతో రిలీజైన ఈ చిత్రం తొలిరోజున ఈ చిత్రం రూ.17.50 కోట్లతో సరిపెట్టుకొన్నది. శనివారం రూ.16 కోట్లకు పడిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురిచేసింది.

సెలవు దినంగా ఘనంగా.. సోమవారం డీలా

సెలవు దినంగా ఘనంగా.. సోమవారం డీలా

ఇక ఆదివారం సెలవు దినం కావడంతో భాగీ3 మెరుగైన కలెక్షన్లను సాధించింది. ఆదివారం రూ.20 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడంతో డిస్టిబ్యూటర్లు ఊరట చెందారు. ఇక బాక్సాఫీస్‌కు లిట్మస్ టెస్ట్‌గా మారిన సోమవారం మరీ దారుణంగా రూ.9 కోట్లకు మాత్రమే పరిమితమైంది. దాంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రం రూ.63 కోట్లు రాబట్టిందనేది ట్రేడ్ రిపోర్టు.

 ఓవర్సీస్ రిపోర్టు ఇలా..

ఓవర్సీస్ రిపోర్టు ఇలా..

ఇక భాగీ ఓవర్సీస్ రిపోర్టు చేస్తే.. అమెరికా, కెనడాలో ఈ చిత్రం 508 వేల డాలర్లు, యూఏఈ, జీసీసీలో 950 వేల డాలర్లు, యూకేలో 214 వేల డాలర్లు, ఆస్ట్రేలియాలో 156 వేల డాలర్లు, రెస్టాఫ్ వరల్డ్ 482 వేల డాలర్లను నమోదు చేసింది. దాంతో ఓవర్సీస్‌లో 2310 డాలర్లు అంటే 17 కోట్లు గ్రాస్ వసూళ్లను వసూలు చేసింది.

100 కోట్ల వైపు పరుగులు

100 కోట్ల వైపు పరుగులు

కరోనా వైరస్ కారణంగా భాగీ3 చిత్రం తొలి వారాంతానికి అతికష్టం మీద 50 కోట్ల రూపాయల క్లబ్‌ను దాటేసింది. ప్రస్తుత సరళిని చూస్తే రానున్న రోజుల్లో రూ.100 కోట్లకు చేరువయ్యే అవకాశం కనిపిస్తున్నది. రితేష్ దేశ్‌ముఖ్, అంకితా లోఖండే, జైదీప్ అహ్లావత్, విజయ్ వరమ తదితరులు నటించిన ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది.Source link

telugu.filmibeat.com

Leave a Reply