భీష్మ ప్రీ రిలీజ్ బిజినెస్ : ఏ ఏరియాలో ఎంత రేటు పలికిందంటే..? | Nithin Bheeshma Area Wise Pre Release Business

Collections


వరుస ఫ్లాపులతో..

వరుస ఫ్లాపులతో..

అఆ చిత్రం తరువాత సరైన హిట్ లేక రేసులో వెనకబడ్డాడు నితిన్. లై, చల్ మోహనరంగ, శ్రీనివాస కళ్యాణం వంటి డిఫరెంట్ జానర్ చిత్రాలను చేసినా.. ఏ ఒక్కటీ ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. ఈ క్రమంలో భీష్మతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాడు.

భీష్మపై హైప్..

భీష్మపై హైప్..

టైటిల్ రివీల్ చేసిన క్షణం నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు, ట్రైలర్ ఇలా భీష్మపై అంచనాలు పెంచేశాయి. వీటన్నంటితో భీష్మ బాగానే రేటు పలికినట్టు తెలుస్తోంది. ఏ ఏరియాలో ఎంతకు అమ్ముడుపోయిందనే విషయాలు ఓ సారి చూద్దాం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో..

రెండు తెలుగు రాష్ట్రాల్లో..

ఈ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను దాదాపు 23.50 కోట్లకు అమ్మినట్టు తెలుస్తోంది. నైజాం 6.30 కోట్లు.. సీడెడ్ 3.06 కోట్లు.. యుఎ 1.85 కోట్లు… గుంటూరు 1.55 కోట్లు…ఈస్ట్ 1.55 కోట్లు… కృష్ణ 1.40 కోట్లు… వెస్ట్ 1.20 కోట్లు… నెల్లూరు 0.64 కోట్లు… ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 17.50 కోట్లకు సేల్ అయినట్టు తెలుస్తోంది.

మొత్తంగా ఎంతంటే..?

మొత్తంగా ఎంతంటే..?

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి రేటునే సొంతం చేసుకున్న భీష్మ.. రెస్టాఫ్ ఇండియాలో రెండు కోట్లు, ఓవర్సీస్‌లో 2.40కోట్ల మేర పలికినట్టు తెలుస్తోంది. ఇలా మొత్తంగా చూసుకుంటే.. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 23.50 కోట్ల బిజినెస్ చేసినట్టు టాక్.

Brahmaji Teasing Anchor Suma At Bheeshma Pre Release Event | Filmibeat Telugu

భారీ టార్గెట్‌తో బరిలోకి..

భారీ టార్గెట్‌తో బరిలోకి..

భీష్మ చిత్రం దాదాపు 25 కోట్ల షేర్ వసూళ్ల లక్ష్యంతో రాబోతోందన్న మాట. ఒకవేళ టాక్ బాగుంటే.. ఆ మొత్తాన్ని రాబట్టడం అంత పెద్ద కష్టమైన పనేమీ కాదు. బరిలో పెద్ద చిత్రాలు లేకపోవడం, గత వారం విడుదలైన చిత్రాలు దారుణంగా బెడిసి కొట్టడం వంటివి భీష్మకు కలిసొచ్చే అంశాలు.Source link

telugu.filmibeat.com

Leave a Reply