భీష్మ 5 రోజుల వసూళ్లు: బ్రేక్ ఈవెన్ రీచ్.. నితిన్ సత్తా అంటే ఇదే మరి! | Bheeshma BoxOffice Collections: 5 days Report

Collections


Nithiin’s Bheeshma Reaches Break-Even Mark in Just 5 Days

5వ రోజు హవా.. వర్కింగ్ డే డ్రాప్స్

5వ రోజు హవా.. వర్కింగ్ డే డ్రాప్స్

భీష్మ సినిమాతో 2020కి కిక్ స్టార్ట్ ఇచ్చిన నితిన్.. వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఫిబ్రవరి 21వ తేదీన విడుదలైన భీష్మ సినిమా 5వ రోజు కూడా అదే హంగామా కొనసాగించింది. వర్కింగ్ డే అయినప్పటికీ వసూళ్ళలో పెద్దగా డ్రాప్స్ కనిపించకపోవడం విశేషం.

సాలిడ్‌ వీకెండ్.. అదే జోష్

సాలిడ్‌ వీకెండ్.. అదే జోష్

మొదటి వీకెండ్ సాలిడ్‌గా ముగించి బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతున్న భీష్మ మూవీ. 5వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు కొంతమేర డ్రాప్స్‌ని సొంతం చేసుకున్నప్పటికీ, ఈవినింగ్ అండ్ నైట్ షోలకి వచ్చే సరికి తిరిగి గ్రోత్‌ని సాధించింది. మొత్తంగా చూస్తే అన్ని ఏరియాల్లో 5వ రోజు కూడా భీష్మ హంగానే కనిపించింది.

5వ రోజు కలెక్షన్స్..

5వ రోజు కలెక్షన్స్..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5వ రోజుకు గాను 1. 5 కోట్ల మేర కాలేచ్ట్ చేసింది భీష్మ. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

మొత్తంగా ఈ 5 రోజుల్లో

మొత్తంగా ఈ 5 రోజుల్లో

ఇక మొత్తంగా ఈ 5 రోజుల్లో భీష్మ కలెక్షన్స్ చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 18.02 కోట్లు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా చూస్తే 23.73 కోట్లు కలెక్ట్ అయ్యాయి. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది.

ఓవర్సీస్ మార్కెట్‌లో భీష్మ

ఓవర్సీస్ మార్కెట్‌లో భీష్మ

దేశంలోనే గాక ఓవర్సీస్ మార్కెట్ లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది భీష్మ. ఇప్పటికే అక్కడ 600K డాలర్స్ వసూళ్లు రాబట్టి 1 మిలియన్ డాలర్ దిశగా పరుగులు పెడుతోంది. నితిన్, రష్మిక రొమాన్స్ చూసి ఫిదా అవుతున్నారు ఓవర్సీస్ ఆడియన్స్.

సంబరాల్లో నిర్మాతలు.. సక్సెస్ మీట్

సంబరాల్లో నిర్మాతలు.. సక్సెస్ మీట్

కేవలం 5 రోజుల్లోనే భీష్మ ఈ మేర కలెక్షన్స్ రాబట్టడం, బ్రేక్ ఈవెన్ క్రాస్ చేయడంతో నిర్మాతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు మంగళవారం రోజు చిత్రయూనిట్ అంతా కలిసి హైదరాబాద్ లో గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించుకున్న సంగతి తెలిసిందే.

భీష్మ మూవీ.. వెన్నెల కిషోర్ కామెడీ

భీష్మ మూవీ.. వెన్నెల కిషోర్ కామెడీ

నితిన్ హీరోగా రూపొందిన భీష్మ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన్న నటించి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఔట్ అండ్ ఔట్ కామెడీతో వెన్నెల కిషోర్ బాగా ఆకట్టుకున్నాడు. మొత్తానికి నితిన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది ఈ భీష్మ.Source link

telugu.filmibeat.com

Leave a Reply