షాకింగ్‌గా world famous lover కలెక్షన్లు.. 4వ రోజు ఎంత వసూలు చేసిందంటే! | world famous lover world wide 4 days collections

Collections


 ప్రతికూల అంశాలతో

ప్రతికూల అంశాలతో

వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్‌కు ముందు కూడా పెద్దగా బజ్ లేకపోయినా.. విజయ్ దేవరకొండ క్రేజ్‌తో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా విమర్శకులు, సగటు ప్రేక్షకుల ప్రశంసలకు నోచుకోకపోవడం భారీగా దెబ్బ పడింది. దాంతో ఈ సినిమా కలెక్షన్లు రాబట్టడంలో ప్రతికూలత ఎదురైందనే మాట వినిపిస్తున్నది.

 4వ రోజు వసూళ్లు

4వ రోజు వసూళ్లు

ఇక నాలుగో రోజు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఓవరాల్‌గా 1 కోటి రూపాయల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మొత్తంగా 4 వ రోజు 40 నుంచి 50 లక్షలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల రిపోర్టు. ఇక చాలా చోట్ల ఆక్యుపెన్సీ 40 శాతం కూడా లేకపోవడంతో ఇక ముందు వసూళ్లలో మెరుగదల కనిపించకపోవచ్చనే మాట వినిపిస్తున్నది.

 ఓవరాల్‌గా నాలుగు రోజుల కలెక్షన్లు

ఓవరాల్‌గా నాలుగు రోజుల కలెక్షన్లు

వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి సంబంధించిన నాలుగు రోజుల కలెక్షన్లు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఈ చిత్రం రూ.7.10 కోట్లు

రెండో రోజు రూ.2.60 కోట్లు

మూడో రోజు రూ.2 కోట్లు

నాలుగో రోజు రూ.1 కోటి షేర్ సాధించింది. మొత్తంగా ఈ చిత్రం నాలుగు రోజుల్లో రూ.12.70 కోట్లు రాబట్టినట్టు స్పష్టమవుతున్నది.

World Famous Lover Review And Rating | Filmibeat Telugu

 ఇంకా ఎంత రాబట్టాలంటే..

ఇంకా ఎంత రాబట్టాలంటే..

వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం నైజాంలో రూ.9 కోట్లు, సీడెడ్‌లో రూ.4 కోట్లు, ఆంధ్రాలో రూ.10 కోట్లు రాబట్టింది. ఏపీ, తెలంగాణలో World Famous Lover రూ.23 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇక తెలుగేతర రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.5 కోట్లతో మొత్తంగా 30 కోట్లకుపైగా బిజినెస్ నమోదు చేసింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే చిత్రం హిట్ నమోదు చేసుకోవాలంటే ఇంకా 12 కోట్లకుపైగా వసూలు చేయాల్సి ఉంది.Source link

telugu.filmibeat.com

Leave a Reply