50 కోట్ల భీష్మ.. కలెక్షన్ల సునామీ.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ | Nithiin’s Bheeshma In 50 crore club

Collections


bredcrumb

Box Office

oi-Sunil Boddula

|

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘భీష్మ’. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవుతూ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. దేశవిదేశాల్లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఈ మూవీ 50 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా క్లాస్, మాస్ అన్ని సెంటర్లలో భారీ ఓపెనింగ్స్ రాబట్టి నేటికీ అదే జోరును కొనసాగిస్తోంది. దేశంలోనే గాక విదేశాల్లో సైతం భీష్మకు భారీ రెస్పాన్స్ వస్తుండటం విశేషం. కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసిన భీష్మ.. ఇంకా వసూళ్ల ప్రవాహాన్ని పారిస్తూనే ఉంది.

 Nithiins Bheeshma In 50 crore club

భీష్మ లాభాల బాట పట్టడంతో చిత్రయూనిట్ అంతా ఫుల్ ఖుషీ అవుతోంది. ఇప్పటికే గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించిన యూనిట్ సభ్యులు.. ఫిబ్రవరి 29న గ్రాండ్ థాంక్స్ మీట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి వరుణ్ తేజ్ ముఖ్య అతిధిగా రానున్నాడు. ఇకపోతే దగ్గరలో గట్టి పోటీనిచ్చే సినిమాలేవీ లేకపోవడం కారణంగా ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు ట్రేడ్ పండితులు.Source link

telugu.filmibeat.com

Leave a Reply