Allu Arjun Ala vaikunthapurramuloo closing collections: బాక్సాఫీస్‌ను రఫ్ ఆడించిన స్టైలిష్ స్టార్

Collections


ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్

ఏపీ, తెలంగాణలో అల వైకుంఠపురంలో మూవీ రూ.65 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాంలో రూ.19 కోట్లు, సీడెడ్‌లో రూ.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.8.5 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.6.30 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.5 కోట్లు, గుంటూరులో రూ.6.3 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.5 కోట్లు, నెల్లూరులో రూ.2.78 కోట్ల బిజినెస్ చేసింది. దాంతో ఏపీ, తెలంగాణలో రూ.65 కోట్లకుపైగా బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటకలో రూ.7.2 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.1.4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.9.8 కోట్ల మేర జరిగింది.

 నైజాం, ఓవర్సీస్ కలెక్షన్లు

నైజాం, ఓవర్సీస్ కలెక్షన్లు

అల వైకుంఠపురంలో క్లోజింగ్ కలెక్షన్లు చూస్తే.. నైజాం, తెలంగాణలో కలిపి రూ.128.68 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం నైజంలో రూ.44.3 కోట్లు, కర్ణాటక రూ.9.18 కోట్లు, కేరళలో రూ.1.17 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.1.44 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో రూ.18.33 కోట్లు కలెక్ట్ చేసింది.

ఆంధ్రా, సీడెడ్‌లో వసూళ్లు

ఆంధ్రా, సీడెడ్‌లో వసూళ్లు

ఇక ఏపీ విషయానికి వస్తే.. సీడెడ్‌లో రూ.18.13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.11.31 కోట్లు, పశ్చిమ బెంగాల్‌లో రూు.8.85 కోట్లు, గుంటూరు రూ.11.05 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.10.67 కోట్లు, నెల్లూరులో రూ.4.66 కోట్లు రాబట్టింది. దీంతో డిస్టిబ్యూటర్లు భారీ లాభాలను సొంతం చేసుకొన్నారు.

#HappyBirthdayAlluArjun: Allu Arjun Special Gift To Fans

253 కోట్ల గ్రాస్ వసూళ్లు

253 కోట్ల గ్రాస్ వసూళ్లు

అల వైకుంఠపురంలో చిత్రం సుమారు రూ.85 కోట్ల సాధించే టార్గెట్‌తో రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం అందరి అంచనాలను బ్రేక్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ.253.85 కోట్ల గ్రాస్, రూ.158.80 కోట్ల నికర లాభాలను సొంతం చేసుకొన్నది. ఇది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యుత్తమ వసూళ్ల రికార్డుగా నిలిచింది.



Source link

telugu.filmibeat.com

Leave a Reply