Bheeshma box office collections: తొమ్మిదో రోజూ కుమ్మేసిన భీష్మ.. ఇప్పటి వరకు వచ్చిన లాభమెంతంటే..? | Bheeshma Day 9 box office collections

Collections


ఆగని వసూళ్లు..

ఆగని వసూళ్లు..

భీష్మ థియేటర్లలోకి వచ్చే సమయానికి గట్టి పోటినిచ్చే సినిమా లేకపోవడం నితిన్‌కు కలిసి వచ్చింది. దీంతో వారం మొత్తం భీష్మ హవానే నడిచింది. ఇక రెండో వారంలోనూ పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో మరింత పుంజుకునే అవకాశం ఉంది.

తొమ్మిదో రోజు ఎంత రాబట్టిందంటే..?

తొమ్మిదో రోజు ఎంత రాబట్టిందంటే..?

భీష్మ తొమ్మిదో రోజు ఏ ఏరియాల్లో ఎంత కొల్లగొట్టిందో ఓ సారి చూద్దాం. నైజాంలో 16లక్షలు, సీడెడ్‌లో 8 లక్షలు, ఉత్తరాంద్రలో 10లక్షలు, ఈస్ట్ 5లక్షలు, వెస్ట్ 4లక్షలు, గుంటూరు 5లక్షలు, కృష్ణా 6లక్షలు, నెల్లూరు 3లక్షలు ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 0.57కోట్లు కొల్లగొట్టింది.

 ఒక్కో రోజు ఎంత వసూల్ చేసిందంటే..?

ఒక్కో రోజు ఎంత వసూల్ చేసిందంటే..?

మొదటి రోజు 6.42కోట్లు కొల్లగొట్టిన భీష్మ.. రెండో రోజు 4.27కోట్ల మేర రాబట్టింది. మూడో రోజు 4.31కోట్లు, నాల్గో రోజు 1.71కోట్లు, ఐదో రోజు 1.22కోట్లు, ఆరో రోజు 81లక్షలు, ఏడో రోజు 43లక్షలు, ఎనిమిదో రోజు 38లక్షలు, తొమ్మిదో రోజు 57లక్షలు కొల్లగొట్టింది.

 ఇప్పటికే ఎంత లాభం వచ్చిందంటే..?

ఇప్పటికే ఎంత లాభం వచ్చిందంటే..?

భీష్మ చిత్రాన్ని అన్ని లెక్కలను కలుపుకుంటే.. 17.85కోట్లకు అమ్ముడు పోయినట్టు టాక్. అయితే ఇప్పటికే లాభాల బాట పట్టేసింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే.. 20.12కోట్లు కొల్లగొట్టగా.. ఇప్పటికీ 2.27కోట్లు లాభాలు వచ్చాయని తెలుస్తోంది. ఇంకా లాంగ్ రన్ పూర్తయ్యే సరికి మరింత నిర్మాత జేబులోకి చేరే అవకాశం ఉంది.



Source link

telugu.filmibeat.com

Leave a Reply