Bheeshma box office collections: నితిన్ కెరీర్‌లో హయ్యెస్ట్‌గా ఓపెనింగ్స్ | Bheeshma day 1 box office collections

Collections


తెలుగు రాష్ట్రాల్లో సూపర్ రెస్పాన్స్

తెలుగు రాష్ట్రాల్లో సూపర్ రెస్పాన్స్

తెలుగు రాష్ట్రాల్లో భీష్మ చిత్రం సానుకూలమైన టాక్‌తో మొదలు కావడం, పలు ప్రాంతాల్లో ఉదయం ఆటకు మంచి రెస్పాన్స్ రావడం జరిగిందని ట్రేడ్ రిపోర్టు వచ్చింది. శివరాత్రి పర్వదినం కావడంతో మార్నింగ్ షో ఆక్యుపెన్సీ కాస్తా తక్కువగా ఉండగా.. మధ్నాహ్నం, ఫస్ట్ షోకు ఆక్యుపెన్సీ పుంజుకోవడం, అడ్వాన్స్ బుకింగ్ కూడా పెరిగిందనే టాక్ వినిపించింది. ఇక శనివారం, ఆదివారం కూడా వీకెండ్ కావడంతో వసూళ్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఓవర్సీస్ డే 1 రిపోర్టు

ఓవర్సీస్ డే 1 రిపోర్టు

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు పక్కన పెడితే.. ఓవర్సీస్‌లో భీష్మ ఓపెనింగ్స్ భారీగానే ఉన్నాయి. కడపటి వార్తలు అందేసరికి భీష్మ చిత్రం 143 లొకేషన్లలో 94 వేల డాలర్లకుపైగా వసూలు చేసినట్టు సమాచారం. నితిన్ కెరీర్‌ను పరిశీలిస్తే యువ హీరోకు మంచి ఓపెనింగ్స్ లభించాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 700000 డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది.

ఏపీ, తెలంగాణలో 5 కోట్లు

ఏపీ, తెలంగాణలో 5 కోట్లు

ఇక తెలుగు రాష్ట్రాల్లో భీష్మ కలెక్షన్లు భారీగానే నమోద అయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కడపటి వార్తలు అందేసరికి ఏపీ, తెలంగాణలో కలిపి ఈచిత్రం రూ.5 కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.6 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

హైదరాబాద్‌లో 2020లో తొలి రోజు వసూళ్లు

హైదరాబాద్‌లో 2020లో తొలి రోజు వసూళ్లు

ఇక 2020లో హైదరాబాద్ రిలీజైన సినిమాల తొలి రోజు వసూళ్ల ట్రాక్ రికార్డు చూస్తే.. సరిలేరు నీకెవ్వరు చిత్రం రూ.4.39 కోట్లు, అల వైకుంఠపురం రూ.2.36 కోట్లు, దర్బార్ రూ.1.36 కోట్లు, భీష్మ రూ.101 కోట్లు, డిస్కో రాజా 69 లక్షలు వసూలు చేసింది. సెకండరీ గ్రేడ్ హీరోల్లో నితిన్ సినిమాకు మంచి ట్రేడ్ రిపోర్టు రావడంతో సినీ వర్గాల్లో సంతోషం వ్యక్తం అవుతున్నది.

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో కలెక్షన్లు

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో కలెక్షన్లు

సినీ రాజధానిగా పేర్కొనే హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో దిగువ శ్రేణి హీరోల సినిమాల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ అత్యధికంగా 15 లక్షలకుపైగా, డియర్ కామ్రేడ్ రూ.13 లక్షలకుపైగా, వెంకీ మామ సుమారు 8 లక్షల రూపాయలు, ఎఫ్2 సినిమా 7.62 లక్షలు, భీష్మ రూ.7.60 లక్షలు, జెర్సీ రూ.7.5 లక్షలు, మజిలీ రూ.7.57 లక్షలు వసూలు చేశాయి.



Source link

telugu.filmibeat.com

Leave a Reply