HIT movie collections: రెండో రోజూ అదే జోరు.. ఏ ఏరియాలో ఎంత కొల్లగొట్టిందంటే..? | Vishwak Sen’s HIT movie Day 2 box office report

Collections


 మొదటి రోజు ఎంతంటే..?

మొదటి రోజు ఎంతంటే..?

శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ చిత్రం సూపర్ హిట్ నిలవబోతోంది. ఈ చిత్రం మొదటి రోజే 1.32కోట్ల గ్రాస్‌ను రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాబట్టినట్టు తెలుస్తోంది. ఇదే ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. 1.67కోట్ల మేరకు కొల్లగొట్టింది.

ఇక రెండో రోజూ అదే జోరు..

ఇక రెండో రోజూ అదే జోరు..

మొదటి ఆట అయ్యాక వచ్చి టాక్‌తో థియేటర్లన్నీ జనసందోహంగా మారడంతో కలెక్షన్లలోగ్రాఫ్ పెరగుతూనే వచ్చింది. ఆ తేడా కలెక్షన్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రం రెండో రోజూ 1.09 కోట్ల మేర రాబట్టగా..మొత్తం రెండు రోజుల్లో 2.41కోట్లు కలెక్ట్ చేసింది.

ఏ ఏరియాలో ఎంతంటే..?

ఏ ఏరియాలో ఎంతంటే..?

రెండో రోజు హిట్ చిత్రం ఏ ఏరియాలో ఎంత కొల్లగొట్టిందో ఓ సారి చూద్దాం. నైజాంలో 67 లక్షలు, సీడెడ్‌లో 9లక్షలు, ఉత్తరాంద్రలో 5లక్షలు, ఈస్ట్ 5లక్షలు, వెస్ట్ 5లక్షలు, గుంటూరు 4లక్షలు, కృష్ణా 5లక్షలు, నెల్లూరు 3లక్షలు ఇలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.09కోట్లను కొల్లగొట్టింది. రెండు రోజుల్లో 2.41కోట్లు రాబట్టగా.. మరో 1.19కోట్లను కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని తెలుస్తోంది. అంటే ఆదివారం కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ కొట్టేయబోతోందన్న మాట.

HIT ప్రీ రిలీజ్ బిజినెస్

HIT ప్రీ రిలీజ్ బిజినెస్

హిట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విశేషాలేంటో ఓ సారి చూద్దాం. నైజాం థియేట్రికల్ హక్కులు రూ.1.4 కోట్లు, సీడెడ్‌లో రూ.40 లక్షలు, ఆంధ్రాలో రూ.1.80 కోట్లు మేరకు అమ్ముడుపోయాయి. దీంతో ఏపీ, తెలంగాణలో ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా రూ.3.60 కోట్లు పలికింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు రూ.20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.60 లక్షలతో వరల్డ్ వైడ్ బిజినెస్ రూ.4.40 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.



Source link

telugu.filmibeat.com

Leave a Reply