అంత ఇబ్బందిగా ఉంటే చేయడం ఎందుకో…!

Movie NewsYoung Hero Afraid Of Losing His Lover Boy Image!

టాలీవుడ్ లో అడుగుపెట్టే చాలా మంది హీరోలు మొదట్లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకుని తర్వాతి రోజుల్లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్ హీరో అనిపించుకుంటే క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా విస్తరిస్తుందని మన హీరోలు ఆలోచిస్తుంటారు. అందుకే కెరీర్ ప్రారంభంలో సాఫ్ట్ రోల్స్ చేసి ఒకటి రెండు సినిమాలు సక్సెస్ అయిన వెంటనే మాస్ ఇమేజ్ పై దృష్టి పెడుతుంటారు. యువ హీరో నాగ శౌర్య కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో చాక్లెట్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న శౌర్య.. మధ్యలో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి నటించిన ‘జాదూగాడు’ సినిమా ప్లాప్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత మళ్ళీ లవర్ బాయ్ గా ‘కల్యాణ వైభోగమే’ ‘జ్యో అచ్యుతానంద’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ‘ఛలో’ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నారు శౌర్య. యూత్ హీరోగా ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ యంగ్ హీరో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ‘అశ్వథ్థామ’ అనే సినిమాకి తనే స్వయంగా స్టోరీ రాసి నటించడంతో పాటు నిర్మించాడు. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ సినిమాగా మిగిలి పోయింది. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా మాస్ హీరో అనిపించుకోవాలని ట్రై చేస్తూ ఈసారి యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శౌర్య ఈ ప్రాజెక్ట్ కోసం కఠోర వ్యాయామాలు చేసి కండలు తిరిగిన దేహాన్ని రెడీ చేసాడు. తన కెరీర్లో 20వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ లో ఈ యువ హీరోని చూసి అది మన నాగ శౌర్యేనా అనుకునే రేంజ్ లో బాడీ ని బిల్డ్ చేసాడు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం చేస్తున్న సినిమాల వల్ల లవర్ బాయ్ ఇమేజ్ పోతుందని భయంగా ఉందని రీసెంట్ గా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడట శౌర్య. అయితే దీనిపై మీడియాతో పాటు సినీ సర్కిల్స్ లో కూడా ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి అంత ఇబ్బందిగా ఉంటే మాస్ సినిమాలు చేయడం చేయడం ఎందుకో అని.. హాయిగా లవర్ బాయ్ ఇమేజ్ ఉంటే కనీసం మినిమం గ్యారంటీ ఐనా ఉండేదని.. ఇప్పుడు ఈ మాస్ ఇమేజ్ కి వస్తే మాత్రం గ్యారంటీ లేని కెరీర్ అయిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. అయినా మాస్ హీరోగా అంగీకరించాల్సింది ప్రేక్షకులు.. ఇండైరెక్ట్ గా ఎవరికి వారు నేను మాస్ హీరో అయ్యాను అని చెప్పుకుంటే అయిపోతారా? అని మాట్లాడుకుంటున్నారు. ఫీల్ గుడ్ సినిమాలు చేసుకోక ఎందుకు ఈ బాధ అనే వారు కూడా లేకపోలేదు. ఐతే శౌర్య ఫ్యాన్స్ మాత్రం.. ‘మా హీరో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తే తప్పేముంది.. ఒకప్పుడు నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కున్న బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ మార్కెట్ ఇప్పుడు దాదాపు 12 కోట్లు వరకు ఉంది. ఇది కేవలం శ్రీనివాస్ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయడం వల్లే సాధ్యం అయ్యిందనే విషయం అందరికి తెలిసిందే కదా’ అని కామెంట్స్ చేస్తున్నారట. మరి నాగ శౌర్య మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంది హిందీ రైట్స్ కోసమేనా అని సినీ అభిమానులు ఆలోచిస్తున్నారు.Source link

Leave a Reply