అందుకే మీరు మెగాస్టార్..!

Movie NewsThat's why you are a megastar ..!

బాలీవుడ్ బిగ్ బి మెగాస్టార్ అమితాబచ్చన్ వయసు 77 ఏళ్లు. ఈ వయసులో కూడా ఆయన ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ప్రతి రోజు వర్కౌట్ చేయడంతో పాటు ఖచ్చితమైన సమయపాలన పాటిస్తూ డైట్ ఫాలో అవుతున్నారు. చెడు అలవాట్లు ఏమీ లేక పోవడం వల్ల ఆయన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందుకే ఆయన అభిషేక్ బచ్చన్ కంటే ముందే కరోనాను జయించాడు. ఆయన ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. అలా అని పని తక్కువగా చేస్తారా అంటే అది కూడా కాదు. రోజులో ఏకంగా 14 గంటల పాటు పని చేస్తున్నారట.

ఈమద్య కాలంలో బిగ్ బి ఏకంగా రోజులో 14 గంటలు పని చేస్తున్నాను అంటూ పేర్కొన్నారు. తెల్లవారు జాము నుండి మొదలుకుని షూటింగ్ లో పాల్గొంటున్నాను అన్నారు. పోటీ బాగా పెరిగి పోవడంతో పోటీకి తగ్గట్లుగా నేను ఎక్కువ సమయం పనికి కేటాయిస్తున్నట్లుగా అమితాబ్ పేర్కొన్నాడు. నేను రోజులో 14 గంటలు పని చేసేందుకు గాను నా స్టాఫ్ ఎంతో సహకరిస్తున్నారు. వారందరికి కూడా కృతజ్ఞతలు తెలియస్తున్నాను అన్నాడు.

ఈ వయసులో రోజులో 14 గంటల పాటు వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే మీరు మెగాస్టార్ అయ్యారు బిగ్ బి అంటూ అభిమానులు మరియు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బి తన బ్లాగ్ లో ఇంకా.. మనిషి అనే వాడు సాధించాలనుకుంటే దేన్ని అయినా సాధించగలడు. ఈ ప్రపంచంలో అసాధ్యం అనేది లేదు. కష్టపడితే అన్ని కూడా మనకు సమకూరుతాయని బిగ్ బి యువతను ప్రోత్సహిస్తూ తన సందేశాన్ని ఇచ్చారు.Source link

www.tupaki.com

Leave a Reply