అఖిల్-పూజా.. ఆ షూస్ కథేంటి?

Movie Newsఅఖిల్-పూజా.. ఆ షూస్ కథేంటి?

తొలి సినిమాతోనే స్టార్ లీగ్‌లోకి చేరిపోయేలా కనిపించాడు అక్కినేని అఖిల్. కానీ ‘అఖిల్’ సినిమా డిజాస్టర్ కావడంతో అతడి కెరీర్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాతి సినిమా ‘హలో’ అయినా అతడికి ఉపశమనాన్నందిస్తుందేమో అనుకుంటే అదీ జరగలేదు. మూడో సినిమా ‘మిస్టర్ మజ్ను’ సైతం నిరాశ పరిచింది.

ఇప్పుడు అతడి ఆశలన్నీ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మీదే ఉన్నాయి. ఈ సినిమా గీతా ఆర్ట్స్ లాంటి ప్రెస్టీజియస్ బేనర్ మీద తెరకెక్కుతుండటంతో బాగానే ఉంటుందన్న అంచనాలున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే అఖిల్ ఫస్ట్ లుక్ లాంచ్ అయింది. తాజాగా పూజా హెగ్డే లుక్ కూడా రివీల్ చేశారు.

ఈ రెండు లుక్స్ మధ్య ఇంట్రెస్టింగ్ లింగ్ ఉండటం విశేషం. అఖిల్ ఫస్ట్ లుక్‌లో అతను షూస్ లేకుండా ఒట్టి కాళ్లతో రోడ్డు మీద నడుచుకుని వెళ్తుండటం కనిపించింది. అప్పటికి అది పెద్ద విషయంలా కనిపించలేదు. కానీ పూజా లుక్ చూస్తే అఖిల్ బేర్ ఫుట్‌తో వెళ్లడం వెనుక ఏదో కథ ఉందనిపిస్తోంది. అఖిల్ మైకు ముందు నిలబడ్డ పూజా.. తన రెండు చేతుల్లో షూస్ పెట్టుకుని అరుస్తోంది. పూజా షూస్ తీసుకోవడం వల్లే అఖిల్ ఒట్టి కాళ్లతో రోడ్డు మీద నడుస్తున్నట్లున్నాడు. దీని వెనుక స్టోరీ ఏంటన్నది తెలియాల్సి ఉంది. పూజా లుక్ బయటికి వచ్చినప్పటి నుంచి నెటిజన్లు రెచ్చిపోతున్నారు.

అఖిల్ షూలు కొట్టేసింది నువ్వా.. ఎందుకలా ఏడిపిస్తున్నావు.. ఇచ్చేయమ్మా అంటూ సరదాగా మీమ్స్ వేస్తున్నారు. మొత్తానికి సినిమా మీద ఒక డిస్కషన్ నడిచేలా భాస్కర్ అండ్ టీం అఖిల్, పూజాల ఫస్ట్ లుక్స్ బాగానే ప్లాన్ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.Source link

Leave a Reply