అదే నిజమైతే.. నందమూరి ‘ఫ్యాన్స్’కి పూనకాలే!fans wll go crazy with this combo

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ అంటే మంచి క్రేజ్
ఏర్పడింది. వీరిద్దరి కలయికలో వచ్చిన అరవింద సమేత సినిమా 2018లో బ్లాక్
బస్టర్ లలో ఒకటి. ఎన్టీఆర్ సినీ కెరీర్లో అరవింద సమేత మంచి విజయాన్ని
సాధించిందని అందరికి తెలిసిందే. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కలిస్తే ఆ మ్యాజిక్
వేరు. ఎన్టీఆర్ నుండి కొత్తరకం బాడీ లాంగ్వేజ్ డైలాగ్స్ పలికించిన ఘనత
త్రివిక్రమ్ కి చెందుతుంది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’
సినిమాతో బిజీ అయిపోయాడు. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో కలిసి ‘అల
వైకుంఠపురంలో’ సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి భారీ విజయాన్ని తన ఖాతాలో
వేసుకున్నాడు. అయితే తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే తెరకెక్కించనున్నాడు.
వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె
హస్తినకు’ అనే టైటిల్ ఖరారు చేశారు.

అయితే తాజా సమాచారం ప్రకారం..
ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన
విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఇంకా చాలా డేట్స్ ఆర్ఆర్ఆర్ కోసం
కేటాయించాల్సి ఉన్న నేపథ్యంలో చాలా గ్యాప్ వస్తుందని త్రివిక్రమ్ భావించి
ఎన్టీఆర్ స్క్రిప్ట్ పనులలో ఉన్నాడట. కేవలం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్
పనుల మీద దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎన్టీఆర్ తో ఈ సినిమా పూర్తి చేశాకే
వేరే సినిమా గురించి ఆలోచిస్తారని కన్ఫర్మ్ చేసాడు. ఇక ఈ సినిమాను హారిక
అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్
రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు
అవసరం అవుతారట. మరో విషయం ఏంటంటే.. పొలిటికల్ ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామాగా
తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు ఓ పాత్రలో కళ్యాణ్ రామ్
కనిపించనున్నట్లు లేటెస్ట్ టాక్. కళ్యాణ్ రామ్ పాత్ర సినిమాను మలుపు
తిప్పుతుందని తాజా సమాచారం. అయితే ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఒకవేళ నిజమైతే గనక నందమూరి అభిమానులకు పూనకాలే.. అని చెప్పవచ్చు.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *