అనాథలను దత్తత తీసుకొని మంచి మనసు చాటుకున్న దిల్ రాజు…!Dil Raju who adopted orphans and expressed a good heart ...!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మంచి మనసు చాటుకున్నారు. తల్లిదండ్రుల అకాల మరణంతో అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తెలంగాణా రాష్టంలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరుకు చెందిన గట్టు సత్తయ్య గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు. భార్య అనురాధ కూలి పనులు చేసుకుంటూ పిల్లల బాధ్యత చేసుకుంటుండగా.. రెండు రోజుల క్రితం ఆమె కూడా మరణించింది. గ్రామస్థులు చందాలు వేసుకొని ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో తొమ్మిదేళ్ల పెద్ద కుమారుడే పెద్ద దిక్కుగా మారి తన చెల్లి తమ్ముడి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆత్మకూరు సర్పంచితో మాట్లాడి పిల్లల సంక్షణపై చర్చించారు.

కాగా ఈ విషయాన్ని ఎర్రబెల్లి దయాకర్ నిర్మాత దిల్ రాజుకు వివరించారు. దీంతో అనాథలైన ఆ ముగ్గురు పిల్లలను దత్తత తీసుకోవాలని దిల్ రాజు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు వెల్లడిస్తూ.. ”తల్లిదండ్రులను కోల్పోయిన ఆ ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుంటున్నాను. మనోహర్ లాస్య యస్వంత్ లను మా ఫ్యామిలీలోకి తీసుకురావడం నాకు సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చి వారికి నా తరపున సహాయం జరిగేలా చూసినందుకు మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావుకి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ఫ్యామిలీ ఏర్పాటు చేసిన మా పల్లె ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి బాధ్యలు చూసుకుంటాను” అని పేర్కొన్నారు. దీనిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మరోసారి దిల్ రాజు కు ఫోన్ చేసి అభినందించారు.

ఇదిలా ఉండగా ఇప్పటికే మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న నటుడు సోనూసూద్ వారికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. వారు ఎంతమాత్రం అనాథలు కారని.. వారి బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. మహారాష్ట్రలోని నాసిక్ కు తీసుకువచ్చి వారిని ఓ ఆశ్రమంలో ఉంచుతానని తెలిపారు. ఇప్పుడు దిల్ రాజు సైతం వారి పరిస్థితికి చలించిపోయి ఆ ముగ్గురిని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. ఏదేమైనా ఇలా సెలబ్రిటీలు మానవత్వంతో ముందుకొచ్చి తమ సామాజిక బాధ్యత నిర్వర్తించడం మంచి విషయమని చెప్పుకోవాలి.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *