అనిల్‌ రావిపూడికి దూరంగా రామ్‌ చరణ్‌



అనిల్‌ రావిపూడికి దూరంగా రామ్‌ చరణ్‌

‘సరిలేరు నీకెవ్వరు’ కూడా హిట్‌ సినిమాగా పాస్‌ అయిపోగా ఇంతవరకు ఒక్క ఫ్లాప్‌ కూడా లేని క్లీన్‌ రికార్డ్‌ మెయింటైన్‌ చేస్తోన్న అనిల్‌ రావిపూడికి మామూలుగా అయితే పిచ్చ డిమాండ్‌ వుండాలి. అగ్ర హీరోలంతా ఈపాటికే తనకోసం క్యూ కట్టేసి వుండాలి. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’లో ఫ్రెష్‌ ఐడియాలే లేకపోవడం, కామెడీ కూడా విమర్శలకి గురి కావడంతో అతనితో కలిసి పని చేయాలనే ఉత్సాహం స్టార్‌ హీరోల్లో కనిపించడం లేదు.

‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత తనతో పని చేస్తానని అప్పట్లో రామ్‌ చరణ్‌ అతనితో చెప్పాడట. ఒక టాప్‌ హీరోతో త్వరలోనే సినిమా అనౌన్స్‌ అవుతుందని కూడా అనిల్‌ రావిపూడి మీడియాతో చెప్పాడు. కానీ సరిలేరు నీకెవ్వరు చూసిన తర్వాత రామ్‌ చరణ్‌కి రావిపూడి పట్ల ఆసక్తి పోయిందట. బోయపాటి శ్రీనుతో చేసిన వినయ విధేయ రామ ఫలితం తర్వాత చరణ్‌ ఇక రెగ్యులర్‌ మాస్‌ చిత్రాలకి దూరంగా వుండాలని డిసైడ్‌ అయ్యాడు.

ఇదిలావుంటే మహేష్‌ తర్వాత మరో అగ్ర హీరోతో చేయాల్సిన రావిపూడి ఇప్పుడు ‘ఎఫ్‌ 2’ సీక్వెల్‌ కోసం స్క్రిప్ట్‌ రెడీ చేసే పనిలో పడ్డాడు. అయితే మహేష్‌తో మరో సినిమా చేసే అవకాశమయితే త్వరలోనే వస్తుందని అనిల్‌ ఆశిస్తున్నాడు.



Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *