ఆంధ్రా అమ్మాయి.. నైజాం అబ్బాయి లవ్ స్టోరి

Movie NewsActor Nithiin Gets Engaged To His Lady love

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ .. ప్రియురాలు షాలిని కందుకూరిని వివాహమాడుతున్న సంగతి తెలిసిందే. వీరిది పెద్దలు కుదుర్చిన ప్రేమ వివాహం. షాలిని బ్రిటన్ లో ఎంబీఏ మాస్టర్స్ పూర్తి చేశారు. అయితే షాలిని నేపథ్యం ఏమిటి? అంటే.. కేవలం ఎన్నారై అని మాత్రమే ఇప్పటివరకూ తెలుసు. ఇక తన స్వస్థలం ఆంధ్రా అంటూ అభిమానుల్లో ముచ్చట సాగుతోంది.

ఇదే గనుక నిజం అయితే.. ఆంధ్రా అమ్మాయి- తెలంగాణ (నైజాం) అబ్బాయి లవ్ స్టోరి అని భావించాల్సి ఉంటుంది. నేడు హైదరాబాద్ లోని  నితిన్ నివాసంలో ప్రీవెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంతో ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు. పెళ్లి పందిరిలో సందడి అంతా ఇప్పటికే ఫోటోల రూపంలో సామాజిక మాధ్యమాల్లో రివీలైంఇ. ఈ వేడుకకు ఇరు కుటుంబాల పెద్దలతో పాటు .. కొద్ది మంది బంధు మిత్రులు హాజరయ్యారని తెలుస్తోంది. ఇక ఎంతో డీసెంట్ ఎఫైర్ గా సాగిన ఈ వేడుకకు మీడియాని ఆహ్వానించలేదు.

ఏప్రిల్ 16న దుబాయ్లోని పలాజో వర్సాచీ హోటల్ లో నితిన్- షాలిని జంట వివాహం జరగనుంది. ఇక షాలిని తొలి ఫోటో నిన్ననే రివీలైంది. తాజాగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో కుందనపు బొమ్మను తలపిస్తున్న ఫోటోలు నితిన్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెద్దల ఆశీర్వాదంతో పెళ్లికి రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 15 మొదలు పెళ్లి ఏర్పాట్లు జరగనున్నాయని నితిన్ తెలిపారు. ‘పెళ్లి పనులు మొదలయ్యాయి.. మ్యూజిక్ స్టార్ట్స్.. మీ ఆశీస్సులు కావాలి’ అంటూ నితిన్ ట్వీట్ చేశారు.Source link

Leave a Reply