
ఆచార్య షూటింగ్ కి గ్యాప్ ఇచ్చి డాటర్ పెళ్లికి..!
మెగాస్టార్ చిరంజీవి గత నెలలో ఆచార్య సెట్స్ లో చేరాల్సి ఉంది. కానీ
ఇంతలోనే కోవిడ్ 19 టెస్ట్ లో పాజిటివ్ రావడంతో ఆయన స్వీయనిర్భంధంలోకి
వెళ్లారు. ఆ క్రమంలోనే ముందే అనుకున్న షెడ్యూల్స్ డిస్ట్రబ్అయ్యాయి.
చిరుకి ఇలా జరగడం మంచి సంకేతం కాదని భావించిన చిత్రబృందం షెడ్యూల్ కి
మరో తేదీని ఫిక్స్ చేసుకుంది.
తాజా సమాచారం ప్రకారం… ఈసారి
మరింత పకడ్భందీగా చాలా జాగ్రత్తలు తీసుకున్న చిరు హైదరాబాద్ ఔటర్ రింగ్
రోడ్ సమీపంలో ఈ రోజు సెట్స్ కి వచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ
ప్రారంభించారు. అతనిపై ఒక ప్రత్యేక పోరాట సన్నివేశం
చిత్రీకరిస్తున్నారట. చిరంజీవి ఈ వారం అంతా షూటింగ్ లో పాల్గొంటారు.
మరోవైపు
డిసెంబర్ 9న మెగా ప్రిన్సెస్ నిహారిక వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్ లో
జరగనుంది. ఈ వివాహం కోసం చిరు ఉదయపూర్ వెళ్తారు. అది పూర్తయ్యాక..
కోరటాలల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య కోసం నాన్ స్టాప్ షూట్
చేస్తారని సమాచారం.