‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ప్లాన్ మారిందా…?

Movie NewsHas the 'RRR' shooting plan changed ...?

దర్శకధీరుడు రాజమౌళి రెండేళ్ల గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తున్న భారీ
మల్టీస్టారర్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’. స్టార్ట్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ –
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ
రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి
సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్న సంగతి
తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్
తో ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే
70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి కరోనా వచ్చి బ్రేక్స్
వేసింది. దీంతో నాలుగున్నర నెలల సమయం వృధాగా పోయింది.

కాగా కరోనా
ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో తెలియని పరిస్థితులలో సినిమా షూటింగ్స్
ఇప్పుడిప్పుడే తిరిగి స్టార్ట్ అవుతున్నాయి. అయితే అవుట్ డోర్ షూట్స్ కి
ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ఇండోర్ షూటింగ్స్ కే పరిమితం అవుతున్నారు.
అయితే వీటిని బ్రేక్ చేస్తూ అక్షయ్ కుమార్ తన లేటెస్ట్ మూవీ ”బెల్ బాటమ్”
షూటింగ్ కొరకు అనుమతులు తీసుకొని విదేశాలకు వెళ్లారు. దీంతో మేకర్స్ అందరూ
ఇప్పుడు ధైర్యం తెచ్చుకుని ఫారిన్ షెడ్యూల్స్ ప్లాన్ చేసే ఆలోచన
చేస్తున్నారు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని
టెన్షన్ పడుతున్న రాజమౌళి చిత్రీకరణ ప్రారంభించడానికి అందుబాటులో ఉన్న
అన్ని మార్గాలను వెతుకుతున్నారు.

ఈ నేపథ్యంలో ”బెల్ బాటమ్”
దారిలోనే విదేశాల్లో షూట్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారట
‘ఆర్.ఆర్.ఆర్’ మేకర్స్. అది కుదరకపోతే ముందుగా ప్లాన్ చేసుకున్నట్లే ఇతర
రాష్ట్రాల్లో షూట్ చేయాలని అనుకుంటున్నారట. అయితే రాజమౌళితో పాటు ఆయన
కుటుంబ సభ్యులు కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన పూర్తిగా కరోనా నుండి
కోలుకున్నాక దీనిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో
చర్చించుకుంటున్నారు.Source link

Leave a Reply