ఆలోచింపజేసేలా ‘మిస్ ఇండియా’ లచ్చగుమ్మడి

Movie News'Miss' India' Pumpkin to think about

కీర్తి సురేష్ హీరోయిన్ గా జగపతిబాబు.. నదియా.. రాజేంద్ర ప్రసాద్..
నరేష్ కీలక పాత్రలో నటించిన ‘మిస్ ఇండియా’ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి
విడుదలకు సిద్దం అయ్యింది. ప్రముఖ ఓటీటీ ద్వారా విడుదల కాబోతున్న ఈ సినిమా
వీడియో సాంగ్ ను విడుదల చేశారు. లచ్చ గుమ్మడి అంటూ సాగే ఈ పాట అందరిని
ఆకట్టుకుంటుంది. థమన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటకు మంచి హైప్
వచ్చింది. సినిమాపై అంచనాలు పెరిగేలా ఈ పాట ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి
లేదు.

ఈ లిరికల్ వీడియో సాండ్ ఆర్ట్ తో ప్రజెంట్ చేశారు. థమన్
మెలోడియస్ గా ఈ పాటను ట్యూన్ చేశాడు. కళ్యాణ్ చక్రవర్తి రాసిన సాహిత్యం
ఆలోచింపజేసి విధంగా ఉంది. సినిమా కథను సాహిత్యంలో వివరించే ప్రయత్నం
చేయడంతో పాటు సినిమాలో హీరోయిన్ పాత్రకు సంబంధించి పరిచయం కూడా ఉంది.
మొత్తానికి ఈ పాట క్లాస్ ఆడియన్స్ పాటు మాస్ ఆడియన్స్ ను కూడా ఎంటర్
టైన్ చేసే విధంగా ఉంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది.
ఇప్పుడు పాట కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మిస్ ఇండియా సినిమా ఒక
అమ్మాయి తన కాళ్లపై తాను నిలబడేందుకు చేసే ప్రయత్నంగా చూపించారు.Source link

www.tupaki.com