ఆ తమిళ స్టార్ హీరో తండ్రి బాడీ చూస్తే ఫిదా..వయసు 82 అంటే నమ్మలేం!

Movie NewsVishal Father GK Reddy Impresses Everyone With His Fitness

వయసులో ఎంత కండలు తిరిగిన దేహం ఉన్నా.. వయస్సు అయిపోతే మాత్రం అవి కరిగిపోవడం మామూలే.  కండలు పెంచాలనే   కోరిక కూడా ఒక ఏజ్ వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత భార్య పిల్లలంటూ తీరికలేని జీవితం గడుపుతూ వ్యాయామానికి గుడ్ బాయ్ చెబుతుంటారు. వయసు మీరినా కండలు తిరిగిన దేహం చాలా కొద్దిమందికే ఉంటుంది. తమిళ హీరో విశాల్ తండ్రి జీకే రెడ్డి వయసు 82 సంవత్సరాలు. ఈ వయసులో ఆయన ఫిట్ నెస్ చూస్తే మాత్రం వావ్..అని అనకుండా ఉండలేం. ఈ వయసులో ఫిట్ గా ఉండడమే గొప్ప అనుకుంటే ఏకంగా ఆయన దేహం కండలు తిరిగి ఉంది.

ఇటీవల ఆయన  జిమ్ బాడీ ఫోటోలు వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. అవి చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వయసు లో ఆ ఫిజిక్ ను మెయింటెన్ చేయడం పై అభినందిస్తున్నారు. జీకే రెడ్డి ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆయనకు సపర్యలు చేస్తూ సన్నిహితంగా మెలగడం తో విశాల్ కు కూడా పాజిటివ్ తేలడంతో హోం ఐసోలేషన్ లోనే చికిత్స పొంది కోలుకున్నారు. సీకే రెడ్డి కి మొదటి నుంచి వ్యాయామం చేయడం అలవాటే. ఇప్పుడు ఆయన కోలుకున్న తర్వాత ఆరోగ్యం పై మరింత దృష్టి పెట్టారు. ఇంట్లోనే ఉంటూ మళ్లీ చిన్న చిన్న కసరత్తులు  ప్రారంభించారు.

జీకే రెడ్డి తన పేరు తోనే ఓ ఫిట్ నెస్ సెంటర్ నెలకొల్పారు. ఆ సెంటర్ వచ్చే వారికి వ్యాయామం పై మెలకువలు నేర్పిస్తుంటారు. మొదటి నుంచి ఆయన  ఫిజిక్ మెయింటైన్ చేస్తుండటంతో 82 ఏళ్లు వచ్చినా కండలు తిరిగిన  దేహంతో కనిపిస్తున్నాడు. సోషల్ మీడియా లో ఆయన వీడియోలు  చూసిన వారంతా ఆయన వయసు 82 ఏళ్ళంటే  ఆశ్చర్య పోతున్నారు. ఈ వయసులో అంత బాడీ మెయింటెన్ చేయడం మామూలు విషయం కాదని అభినందిస్తున్నారు. జీకే రెడ్డి జీకే గ్రానైట్స్ కంపెనీ పేరుతో గ్రానైట్ వ్యాపారం చేస్తుంటారు. తమిళ్ లో పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.Source link

www.tupaki.com

Leave a Reply