ఆ బ్లాక్ బస్టర్ సినిమా లో ముందు విజయే హీరో.. కానీ వదులు కున్నాడు : శంకర్

Movie Newsdirector shankr Talking About Oke Okkadu Movie

యాక్షన్ కింగ్ అర్జున్ హీరో మనీషా కొయిరాలా హీరో  హీరోయిన్లు గా  కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం ముదల్వాన్(తెలుగులో ఒకే ఒక్కడు) సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. 1999లో విడుదల అయిన ఈ సినిమా కలెక్షన్ల తో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు సాధించింది. ఈ సినిమాతో అర్జున్ కి వచ్చిన స్టార్డం అంతా ఇంతా కాదు. తెలుగులోనూ ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ మార్మోగుతుంటాయి. ఏఆర్ రెహమాన్ అదిరి పోయే మ్యూజిక్ ఇచ్చాడు.

 ఒకే ఒక్కడు సినిమాలోని ఒక్క రోజు సీఎం అన్న కాన్సెప్ట్ అందరికీ నచ్చింది. ఆ తరువాత పలు   సినిమాల్లో ఆ కాన్సెప్ట్ ని వాడుకున్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన సినిమాలో మొదట హీరో అర్జున్ కాదట. దర్శకుడు శంకర్ ఈ మూవీని దళపతి విజయ్తో తీయా లనుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల విజయ్ ఈ సినిమాను వద్దనుకున్నారు. ఆ తర్వాత ఆ కథను శంకర్ అర్జున్  కు వినిపించడం..ఆయనకు  బాగా నచ్చడంతో పట్టాలెక్కించారు. అయితే  ఈ సినిమాను విజయ్  ఎందుకు వద్దనుకున్నారో చెబుతూ ఆనాటి సంగతులను శంకర్ వెల్లడించారు.

ముందుగా ఒకే ఒక్కడు స్క్రిప్ట్  సిద్ధం చేసిన శంకర్  కథ వినిపించేందుకు మొదట విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దగ్గరకి వెళ్లారట. ఆయనకు ఈ కథ బాగా నచ్చినప్పటికీ విజయ్ అప్పటికే మరిన్ని ప్రాజెక్ట్లను ఒప్పుకుని ఉండటంతో డేట్లు క్లాష్ అయ్యే అవకాశం ఉండటంతో ఈ సూపర్ హిట్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో చాలా ఏళ్ల వరకు సినిమా రాలేదు.

బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన త్రీ ఇడియట్స్ మూవీ శంకర్ కు నచ్చడంతో ఆ సినిమాను  ఆయన తమిళ్ లో విజయ్ హీరోగా రీమేక్ చేశారు. అదే  నన్బన్. తెలుగులో స్నేహితుడు పేరుతో విడుదలైంది. అయితే ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం శంకర్ కమలహాసన్ తో భారతీయుడు-2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఒకే ఒక్కడు సీక్వెల్ తీయాలని శంకర్ అనుకుంటున్నారట. ఈ సినిమా కోసం  విజయ్ ని తీసుకోవాలని  ఆయన భావిస్తున్నారట. అయితే ఈసారైనా విజయ్ ఓకే చెప్తారా  లేదా అని దళపతి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.Source link

www.tupaki.com

Leave a Reply