ఆ సింగర్ ఇంకా ‘సల్మాన్’ను వేధిస్తూనే ఉందిగా!That Singer is still harassing Salman!

సోనా మహాపాత్ర.. బాలీవుడ్ ప్రముఖ గాయని. ఆమె ఇప్పటివరకూ పాడిన పాటల కన్నా..
ఆమె చేస్తున్న వివాదాస్పద ట్వీట్ల వలనే ఎక్కువగా విమర్శలకు గురవుతూ
వస్తుంది. విమర్శలను కొని తెచ్చుకుంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇదివరకే భారత్ సినిమా హీరోయిన్ ప్రియాంకా చోప్రా చివరకు నిరాకరించడంతో అతి
కష్టం మీద కత్రీనా కైఫ్ ని ఒప్పించి హీరోయిన్ గా తీసుకున్న సంగతి
తెలిసిందే. అప్పట్లో ఈ విషయం పై తీవ్ర విమర్శలు చేసిన సోనా.. మళ్లీ మరో
మారు ట్విట్టర్ లో సల్మాన్ ఖాన్ పై చెలరేగి పోయిందనే చెప్పాలి. బాలీవుడ్
కండలవీరునిపై ఇలాంటి ట్వీట్లు చేయడం సోనాకి కొత్తేమి కాదు. భారత్ మూవీ
నుంచి ప్రియాంక జోనస్ తప్పుకోవడంపై సల్మాన్ ట్వీట్ చేయడాన్ని తప్పుబడుతూ
సోనా గతంలో కూడా ఇలాగే బదులిచ్చింది. ప్రియాంకను సమర్థిస్తూ తనదైన రీతిలో
ట్వీట్తో ఘాటుగా జవాబిచ్చింది. దీంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ రగిలిపోయి
సోనాను చంపేస్తామని బెదిరింపులు జరిపారట.

ప్రస్తుతం ఓ టిక్ టాక్
వీడియో గురించి స్పందించి.. ఆ వీడియోను సల్మాన్ ఖాన్ తో పోల్చుతూ
వివాదాస్పద ట్వీట్ చేసింది. అమిర్ సిద్దిఖీ సోదరుడు ఫైజల్ చేసిన టిక్ టాక్
వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ కుర్రాడు తన ప్రియురాలు
ప్రేమకు అంగీకారం తెలపలేదని ఆసిడ్ దాడి చేసినట్లు చూపించారు. ఆ వీడియోలో
మహిళల పై ఆసిడ్ దాడులు ప్రోత్సహిస్తూ చూపించారని.. సోషల్ మీడియాలో
నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఆ వీడియో తొలగింపు పై నెటిజన్లు అందరూ
టిక్ టాక్ వీడియో తీసేయాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఘటన పై
స్పందించిన సోనా.. “లోకంలో గతానికి వర్తమానానికి మహిళలను కించపరచడం
హింసించడం ఏ మాత్రం మారలేదు. నిజానికి హీరో సల్మాన్ ఖాన్ ను చూస్తున్నాం
కదా! సల్మాన్ తన గర్ల్ ఫ్రెండ్స్ నుదుటిపై సీసాలు పగలగొట్టడం పలుమార్లు
చుశామని చెప్పుకొచ్చింది. కానీ సల్మాన్ ఓ పెద్ద హీరో..? ఫ్యాన్స్ ఇక
ఇలాంటి హీరోను ఫాలో చేయడం మానుకుంటే మంచిదని” అంటూ తన ట్వీట్ ద్వారా
తెలిపింది. ఇంకెంత కాలం ఇలా సల్మాన్ కి వేధిస్తావ్ అంటూ ఫ్యాన్స్ రచ్చ
చేస్తున్నారు.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *