ఆ హీరో బుర్ర నిండా ఐడియాలే!ఆ హీరో బుర్ర నిండా ఐడియాలే!

నాగశౌర్య నిన్న మొన్నటి వరకు అందమైన హీరోగానే తెలుసు. ఇప్పుడతను పెన్ను పట్టాడు. తను వెతుకుతోన్న కథలు రావడం లేదని తన చిత్రానికి తానే కథ రాసుకున్నాడు. అతని అశ్వథ్థామ అలా స్వయంగా రాసుకున్న కథతోనే నిర్మించాడు. అయితే ఇదేదో వన్‌ టైమ్‌ పనితనం కాదని, ఇకమీదట కూడా కథలు రాస్తానని నాగశౌర్య చెబుతున్నాడు. స్వీయ నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌పై ఇతర హీరోలతో కూడా సినిమాలు తీసే ఆలోచన వుందని చెప్పాడు. ఆ చిత్రాలకు తానే కథ రాయవచ్చునని చెప్పుకొచ్చాడు.

ఛలో సినిమాతో స్వీయ నిర్మాణ సంస్థ స్థాపించిన నాగశౌర్య ఆ తర్వాత ‘నర్తనశాల’కి జడ్జిమెంట్‌ కుదరక బొక్కబోర్లా పడ్డాడు. అశ్వథ్థామ కథపై విపరీతమైన నమ్మకం వుండడంతో దానికి తానే నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రం ట్రెయిలర్‌ చూస్తోంటే నిజంగానే విషయం వున్న సినిమాలానే అనిపిస్తోంది. బయటి నిర్మాతలు తనతో చేయడానికి సిద్ధంగానే వున్నా, మంచి దర్శకులే తనతో కలిసి పని చేయడానికి ముందుకొస్తున్నా నాగశౌర్య తన జాతకాన్ని తానే లిఖించుకోవాలని డిసైడ్‌ అయ్యాడు. అయితే అతని నిర్మాణాలు, రచనలు అన్నీ శుక్రవారం విడుదలయ్యే అశ్వథ్థామ ఫలితాన్ని బట్టి డిసైడ్‌ అవుతాయనుకోండి. అది వేరే సంగతి.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *