ఇదేమి పులిహోర బిగ్‍బాస్‍? – Gulte Telugu

Movie News


బిగ్‍బాస్‍ హిందీ సీజన్ల మాదిరిగా హౌస్‍మేట్స్ ఒకరితో ఒకరు పోటాపోటీగా తలపడుతూ ఎలాగైనా గెలవడానికి ఆసక్తి చూపించరు. ఇక్కడంతా ‘రాముడు మంచి బాలుడు’, ‘సీత సుగుణవతి’ అనిపించుకోవడానికే తపన పడుతుంటారు. దీంతో బిగ్‍బాస్‍ హౌస్‍లో రోజూ గంట టెలికాస్ట్ చేయడానికి కూడా మేటర్‍ దొరకడం లేదు. దీంతో బలవంతంగా లవ్‍ •య్రాంగిల్స్కి బీజాలు వేసి దాని చుట్టూనే షో నడిపించడానికి చూస్తుంటారు. ఏటా ఏదో ఒక జంట ఈ బాధ్యత తీసుకుంటూ వుంటుంది. రెండవ సీజన్లో తేజస్వి, సమ్రాట్‍ల ఫేక్‍ రొమాన్స్, గత సీజన్లో రాహుల్‍, పునర్నవిల బలవంతపు రొమాన్స్ ట్రాక్‍లు చూసే వుంటారు.

ఈ ఏడాది మోనల్‍, అభిజీత్‍ మధ్య ట్రాక్‍ నడవాలని స్వయంగా నాగార్జునతోనే హింట్‍ ఇప్పించారు. ఈ ట్రాక్‍లోకి అఖిల్‍ చేరాడు. దీంతో ఈ ట్రయాంగిల్‍ చుట్టూ బిగ్‍బాస్‍ ఎడిటర్లు పులిహోర కలిపేస్తున్నారు. ఇదిలావుంటే నామినేట్‍ అవకుండా తమను తాము కాపాడుకోవడానికి ఫైట్‍ చేస్తారనే ఉద్దేశంతో బోట్‍ టాస్క్ పెడితే ఎవరికి వాళ్లు స్వఛ్ఛందంగా అందులోంచి దిగిపోయి బిగ్‍బాస్‍ టీమ్‍కి బోటు ఖర్చులు దండగ చేసారు.

ఇలాంటి బ్యాచ్‍తో రసవత్తరంగా షో నడిపించడం కష్టమైన విషయం కాబట్టి ఒక రోజు టీవీ సీరియల్‍ యాక్టింగ్‍ చేయమని, ఇంకోరోజు రికార్డింగ్‍ డాన్సులేయమని టాస్కులిస్తూ చూసే జనాలకు చిరాకు తెప్పిస్తున్నారు. రెండో వారానికే మేటర్‍ కొరవడితే ఇక పదిహేను వారాల పాటు ఈ షోకి జనం తగ్గిపోకుండా ఎలా కాపాడుకుంటారు. అసలే ఐపీఎల్‍ కూడా మొదలు కానుంది కనుక బిగ్‍బాస్‍ టీమ్‍ మేలుకుని ఈ షో పట్ల ఆసక్తి కలిగించే పన్నాగాలు మొదలు పెట్టక తప్పదు.

All the Streaming/OTT Updates you ever want. In One Place!Source link

telugu.gulte.com

Leave a Reply