ఇప్పుడు రాక్షసిని కూడా లాగేసుకున్నాడా..?

Movie NewsLavanya Tripathi to romance Karthikeya

పరిశ్రమలో కథలు ఒకరి నుంచి ఒకరికి తారుమారవుతుంటాయి. ఓ హీరో నుంచి ఇంకో హీరోకి బౌండ్ స్క్రిప్టులు తరలి వెళ్లిపోవడం అన్నది తరచూ జరిగేదే. నిజానికి ఆర్.ఎక్స్ 100 స్క్రిప్టు తొలిగా అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర చేయాల్సినది. అనూహ్యంగా కార్తికేయకు వెళ్లిపోయింది. ఆ విషయాన్ని నవీన్ చంద్ర స్వయంగా వెల్లడించాడు. ఆ మూవీ రిజల్ట్ చూశాక పదే పదే ప్రస్థావించాడు.

ఇప్పుడు అందాల రాక్షసి హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా కార్తికేయ సరసన నటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కార్తికేయ- లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న తాజా చిత్రం `చావు కబురు చల్లగా`. ఇదో రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఇందులో అందాల రాక్షసి లావణ్యతో కలిసి నటించడం కార్తికేయకు మిరాకిల్ గానే ఉందిట. ఆ ఇద్దరి మధ్యా రొమాన్స్ పీక్స్ లో ఉంటుందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

కార్తీకేయ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 21 న ఉదయం 11: 47 గంటలకు ఈ సినిమాకి సంబంధించిన టీజింగ్ టీజర్ రిలీజ్ కానుంది.. `బస్తీ బలరాజు` కార్తికేయ ప్రపంచాన్ని ప్రదర్శించే ప్రత్యేక టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. డెబ్యూ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా జీఏ2 సంస్థ నిర్మిస్తోంది.Source link

www.tupaki.com

Leave a Reply