ఈ వెబ్ సిరీస్ ను సినిమా గా మారుద్దాం

Movie Newsఈ వెబ్ సిరీస్ ను సినిమా గా మారుద్దాం

టాలీవుడ్‌లో ‘బిజినెస్ మైండ్’ అంటే ఠక్కున గుర్తొచ్చేవారిలో అల్లు అరవింద్ ఒకరు. అప్పట్లో ‘గజిని’ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసి రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టినా, ఇప్పుడు ‘జెర్సీ’ హిందీ రీమేక్ రైట్స్ కొన్నా.. అల్లు అరవింద్ తెలివికి నిదర్శనమనే చెప్పాలి. అయితే ప్రతి విషయాన్ని బిజినెస్ దృష్టితో అల్లు అరవింద్ ‘ఆహా..’ అనే యాప్ ద్వారా ఓటీటీ వ్యాపారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ వంటి వీడియో బ్రౌజింగ్ ఛానెళ్లలో వెబ్ సిరీస్‌లు యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దాంతో నవ్‌దీప్ హీరోగా, లక్ష్మీకాంత్ చెన్నా అనే యువదర్శకుడి డైరెక్షన్‌లో ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించారు అల్లుఅరవింద్. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ వెబ్ సిరీస్ చూసిన అల్లు అరవింద్… దీన్ని వెబ్ సిరీస్‌గా కంటే సినిమాగా తీస్తే మంచి బిజినెస్ అవుతుందని భావించారట. వెంటనే దర్శకుడిని దీన్ని సినిమాగా మార్చేందుకు కావల్సిన మార్పులు చేయమని కూడా చెప్పేశాడట. అల్లు అరవింద్ గారి ఆలోచనతో ఒక్కసారిగా షాకైన ఆ దర్శకుడు, ఏం చెప్పాలో తెలియక వెబ్ సిరీస్‌ను కత్తిరించి, సినిమాగా మలిచే పనిలో బిజీ అయ్యాడట.

ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్‌లంటేనే యువత ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఆలోచిస్తే సదరు వెబ్ సిరీస్‌లో దమ్ముంటే, ఓటీటీ వ్యాపారంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆహా యాప్‌కు మంచి రేటింగ్స్, వ్యూయర్ షిప్ పెరిగే అవకాశం ఉంటుంది. అలా ఆలోచించకుండా ఇలా వెబ్ సిరీస్‌ను సినిమాగా మార్చాలనుకోవడం సరైన నిర్ణయం కాదని అంటున్నారు కొందరు నెటిజన్స్. ఇలా కక్కుర్తిపడి కొందరు చేతులు కూడా కాల్చుకున్నారని గుర్తుచేస్తున్నారు.  అల్లు అరవింద్ గారు ఈ కామెంట్స్‌ను వింటున్నారో లేదో మరి!Source link

Leave a Reply