ఊర్మిలను శృంగార తార అంటూ తిట్టేసిందిగా

Movie NewsUrmila Matondkar SLAMS Kangana Ranaut's comments

ఆర్జీవీ ఫేవరెట్ హీరోయిన్ `రంగీలా` ఫేం ఊర్మిలను అనకూడని మాట అనేసింది కంగన. ఆమె సాఫ్ట్ శృంగార తార! అంటూ తీసికట్టుగా అవమానకరంగా మాట్లాడడం ప్రస్తుతం బాలీవుడ్ సహా సర్వత్రా చర్చనీయాంశమైంది. ఓ లైవ్ ఇంటర్వ్యూలో కంగన ఈ వ్యాఖ్యలు చేయడంతో ఊర్మిల సపోర్టర్స్ తమదైన శైలిలో కంగనపై విరుచుకుపడుతున్నారు.

మాదకద్రవ్యాల సమస్యకు ఇతర రాష్ట్రాలను నిందించే ముందు కంగనా తన సొంత పెరడు(తోట)లోనే ఓ చూపు చూడాలని ఉర్మిళ మంగళవారం నాడు ఓ జాతీయ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం దుమారం రేపింది. “దేశం మొత్తం మాదకద్రవ్యాల భయాన్ని ఎదుర్కొంటోంది. హిమాచల్ ప్రదేశ్ ఔషధాల(డ్రగ్స్)కు మూలం అని ఆమెకు (కంగనా) తెలుసా? ఆమె తన సొంత రాష్ట్రం నుండే ప్రక్షాళన ప్రారంభించాలి“ అంటూ సెటైర్ వేశారు ఊర్మిల.

దీనికి కౌంటర్ గా కంగన కూడా జాతీయ మీడియా ముందు ప్రతిస్పందిస్తూ ఉరుము ఉరిమడం చర్చనీయాంశమైంది. కంగనా మాట్లాడుతూ.. ఊర్మిలకు నటన తెలియదని తనో శృంగార తార అని కామెంట్ చేయడం సంచలనమైంది. “ఉర్మిలా కూడా మృదువైన శృంగార తార. ఇది చాలా నిర్మొహమాట వ్యవహారమని నాకు తెలుసు. కానీ ఆమెకు నటన కచ్చితంగా తెలియదు. ఆమె దేనిలో ప్రసిద్ధి చెందింది?  భంగిమలు చూపిస్తూ శృంగార సన్నివేశాలు చేయడంలో మాత్రమే. అయినా ఆమె టికెట్ పొందగలిగితే నాకు టికెట్ ఎందుకు రాదు? “అంటూ కంగనా తనదైన శైలిలో విరుచుకుపడింది. ఇక కంగన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఊర్మిలకు మద్ధతుగా నిలిచిన వారిలో స్వరా భాస్కర్ .. అనుభవ్ సిన్హా ఉన్నారు. వీరంతా కంగనపై గరంగరంగా ఉన్న సంగతి తెలిసినదే.

ఇక ఇంతకుముందు జాతీయ మీడియా ఇంటర్వ్యూలో కంగనా స్వయంగా బాలీవుడ్ డ్రగ్ మాఫియా పేర్లను విడుదల చేయాలని ఊర్మిల పిలుపునిచ్చారు. “పేర్లు ఎక్కడ ఉన్నాయి? కంగనా నిజాలు చెప్పడానికి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. పేర్లు చెప్పడం ..ఆ వ్యక్తులను పిలవడం ద్వారా మాకు పెద్దగా సహాయం చేయండి. ఇవన్నీ పూర్తి చేద్దాం. మీ అమ్మాయికి వేళ్లు విరిచే మొదటి వ్యక్తి నేను అవుతాను ”అని ఉర్మిలా సెటైరికల్ గా ఆ ఇంటర్వ్యూలో కంగనపై ధుమధుమలాడారు.Source link

www.tupaki.com

Leave a Reply