ఎట్టకేలకు ఛాన్స్ దక్కించుకున్న ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్…?RP Patnaik makes his comeback with an interesting album

ఆర్. పి. పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా రచయితగా చిత్ర దర్శకుడిగా విభిన్న పాత్రలు పోషించి తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నీకోసం’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమైన ఆర్.పి. పట్నాయక్ ‘చిత్రం’ సినిమాతో ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ తర్వాత ‘మనసంతా నువ్వే’ ‘నువ్వు లేక నేను లేను’ ‘సంతోషం’ ‘నేనున్నాను’ ‘జయం’ ‘దిల్’ ‘సంబరం’ ‘జెమిని’ ‘నీ స్నేహం’ ‘ఈశ్వర్’ ‘నిన్నే ఇష్టపడ్డాను’ ‘నిజం’ సినిమాలతో తన సంగీత మాయాజాలంతో సినీ ప్రియులను అలరించారు. 2000 నుంచి 2006 మధ్య కాలంలో తెలుగునాట అంతటా ఎక్కువగా వినిపించిన పాటలు ఆర్.పి.పట్నాయక్ కంపోజ్ చేసినవే అని చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత దర్శకుడిగా మారిన ఆర్పీ మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమాలు తగ్గించాడు. ఆ తర్వాత ఛాన్సెస్ రాకపోవడం వలన పూర్తిగా దూరమయ్యాడు. కాగా మళ్ళీ ఆర్ పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే సౌత్ ఇండియాలో అతి పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ శ్రేయాస్ మీడియా వారు మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నారట. గతంలో ‘వెంకటాపురం’ అనే సినిమా ప్రొడ్యూస్ చేసి చేతులు కాల్చేసుకున్నారు ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ టీమ్. ఆ తర్వాత మరో సినిమా నిర్మించే సాహసం చేయలేదు. మళ్ళీ ఎప్పటిలాగే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఇక సినిమాలు తీయను అంటూనే శ్రేయాస్ మీడియా మళ్ళీ సినిమా ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టబోతోందట. ఈ సినిమాకి ఆర్ పి పట్నాయక్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారని సమాచారం. ఇటీవలే శ్రేయాస్ ఎంటెర్టైన్మెంట్ అనే ఏటీటీ స్టార్ట్ చేసి సినిమాలను రిలీజ్ చేస్తున్న శ్రేయాస్ గ్రూప్ వారు మళ్ళీ నిర్మాతలుగా మారి సినిమాలు తీయాలని డిసైడ్ అయ్యారట. పైగా ఈ సినిమాకి ఈ టీమ్ మొత్తం కలిసి డైరెక్షన్ కూడా చేయబోతోందట. ఇప్పటికే దర్శకుడిగా నిరూపించుకున్న ఆర్ పి కూడా ఈ సినిమాకి ఒక డైరెక్టర్ కానున్నాడేమో. కాకపోతే ఎక్కువ మంది వంటవాళ్లు వండే కూర చెడిపోతుంది అని సామెత ఉంది. మరి టీమ్ అంతా కలిసి ఒక సినిమాని డైరెక్ట్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు. ఏదేమైనా కానీ ఆర్. పి. పట్నాయక్ కి మళ్ళీ అవకాశం ఇచ్చారు అనేది ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *