ఎడతెరిపి లేని వర్షాలు ఓవైపు.. రకుల్ పై కామెంట్లు మరోవైపు!

Movie NewsRakul Name In Sushanth Drugs Case

అన్ లాక్ 4.0 ప్రక్రియలో షూటింగులకు వెసులుబాటు మరింతగా దక్కింది. కొన్ని నియమనిబంధనలు పాటిస్తూ పనులు మొదలు పెడుతున్నారంతా. ఇక ఇంతకాలం ఎంతో ఓపిగ్గా ఎదురు చూసిన క్రిష్ పవన్ ప్రాజెక్టును కాస్త పక్కకు పెట్టి వైష్ణవ్ తేజ్ తో సినిమాని ప్రారంభించారు. హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో షెడ్యూళ్లు ప్లాన్ చేయడంతో క్రిష్ పని సులువైంది.

ఈ మూవీలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ఎంపిక చేసుకున్న కథాంశం ఆసక్తికరం. పచ్చని కారడవిలో సాగే సాహసోపేత థ్రిల్లర్ మూవీ ఇది. ఈ చిత్రంలో యువ మెగా హీరో వైష్ణవ్ తేజ్ విలేజ్ కుర్రాడిగా కనిపించనుండగా అతడి సరసన రకుల్ కూడా విలేజ్ బ్యూటీగానే కనిపించనుందిట. ఈ చిత్రం షూటింగ్ నిన్నటి వరకు వికారాబాద్ ఫారెస్ట్ లో జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్ సహా వికారాబాద్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా క్రిష్ అతని బృందం షూటింగ్ ని అకస్మాత్తుగా నిలిపివేసి హైదరాబాద్ కు తిరిగి రావలసి వచ్చింది. షూటింగ్ ప్రదేశం పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. చిత్తడిగా మారింది. దీంతో షెడ్యూల్ ని రద్దు చేయడం తప్ప యూనిట్ కి వేరే మార్గం కనిపించ లేదు. సినిమా మొత్తం ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయాలన్నది క్రిష్ పంతం. కానీ అది నెరవేరేట్టు లేదు. తదుపరి షెడ్యూల్కు సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తారట.

ఇక షూటింగులకు కరోనా మహమ్మారీ విజృంభణ ఒక రకమైన తలనొప్పి తెస్తుంటే.. మరోవైపు మాదక ద్రవ్యాల సేవనంలో ఉన్న సెలబ్రిటీల జాబితాని రెడీ చేస్తూ అట్నుంచి టెన్షన్లు తరుముకొచ్చేస్తున్నాయి. ఇటీవల జాతీయ మీడియాలో రకుల్ పై గాసిప్స్ షికారు చేయడం కంగారు పెట్టింది. మొత్తానికి షూటింగులకు అన్నివైపుల నుంచి టెన్షన్లు తప్పడం లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.Source link

www.tupaki.com

Leave a Reply