ఎన్టీఆర్ ను రాకీభాయ్ ని మించి చూపిస్తాడట!

Movie NewsNtr Role In Prashant Neel Movie

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత నటించబోతున్న సినిమాలపై ఫుల్ క్లారిటీ ఉంది. ఆర్ఆర్ఆర్ పూర్తి అయిన వెంటనే విడుదల కాక ముందే త్రివిక్రమ్ దర్శకత్వంలో అయిననూ పోయి రావలే హస్తినకు సినిమాలో నటించబోతున్నాడు. ఆ సినిమాను రాధాకృష్ణ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ లు నిర్మించబోతున్నారు. ఆ సినిమా తర్వాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాను చేసేందుకు ఇప్పటికే ఎన్టీఆర్ సిద్దం అయ్యాడు. ఆ సినిమాకు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది అంటున్నారు.

కేజీఎఫ్ సినిమాలో హీరో యశ్ ను అత్యంత సీరియస్ గా బలవంతుడిగా దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించాడు. ఇప్పుడు అదే విధంగా ఎన్టీఆర్ ను వరల్డ్ ఫేమస్ మాఫియా డాన్ గా చూపించబోతున్నాడట. తనకు అడ్డు వచ్చిన వారిని అత్యంత దారుణంగా చంపేస్తూ రౌడీల గుండెల్లో గుబులు పుట్టించేంతగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని టాక్ వినిపిస్తుంది. కేజీఎఫ్ లో రాకీభాయ్ పాత్రకు మించి ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాలో హీరో పాత్రను ప్రశాంత్ నీల్ చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన కథ చర్చలు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఎన్టీఆర్ కు ఆ సినిమా మరో భారీ పాన్ ఇండియ మూవీగా నిలుస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.Source link

www.tupaki.com

Leave a Reply