ఎన్టీఆర్ సినిమాలో మహేష్ హీరోయిన్ నటించనుందా..?



Will heroine Kiara Advani act in NTR movie...?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ పై మంచి క్రేజ్
ఏర్పడింది. వీరిద్దరి కలయికలో వచ్చిన అరవింద సమేత సినిమా 2018లో బ్లాక్
బస్టర్ లలో ఒకటి. ఎన్టీఆర్ కెరీర్లో అరవింద సమేత మంచి విజయాన్ని
సాధించింది. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కలిస్తే కొత్తరకం బాడీ లాంగ్వేజ్
డైలాగ్స్ ఆశించవచ్చు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’
సినిమాతో బిజిగా ఉన్నాడు. త్రివిక్రమ్ నుండి అల వైకుంఠపురంలో తర్వాత
వస్తున్న సినిమా ఇది. ఎన్టీఆర్ 30వ సినిమా. వచ్చే ఏడాది విడుదల
చేయాలనుకుంటున్న ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ఫిక్స్
చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్
సినిమా కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో
త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనులలో ఉన్నాడట. కేవలం ఎన్టీఆర్
సినిమా స్క్రిప్ట్ పనుల మీద దృష్టి పెట్టినట్లు సమాచారం.

ఇక ఈ
సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై
నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అయితే ఈ సినిమాలో
ఇద్దరు హీరోయిన్లు అవసరం అవుతారని టాక్. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్
సరసన నటించబోయే హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారు మేకర్స్. పొలిటికల్
ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక
హీరోయిన్ బాగుంటుందని భావిస్తున్నారట. ఆమె ఎవరో కాదు కియారా అద్వానీ. భరత్
అనే నేను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ.. రాంచరణ్ సరసన వినయ
విధేయ రామ సినిమాలో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.
అయితే అమ్మడిని ఓకే చేసే ఆలోచనలో త్రివిక్రమ్ టీమ్ ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ నిజమైతే గనక కియారా
భారీ ఆఫర్ కొట్టేసినట్లే అని చెప్పవచ్చు.



Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *