ఒక్క షాట్‌తో మెస్మ‌రైజ్ చేసేశాడుగా..

Movie Newsఒక్క షాట్‌తో మెస్మ‌రైజ్ చేసేశాడుగా..

ఈ రోజుల్లో సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ ఎంత కీల‌క‌మో రుజువు చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. కేవ‌లం ఒక టీజ‌ర్‌తో సినిమాకు పిచ్చ క్రేజ్ వ‌చ్చిన సంద‌ర్భాలు బోలెడు. క‌బాలి సినిమాకు ఆ స్థాయిలో హైప్ వ‌చ్చిందంటే అదిరిపోయేలా క‌ట్ చేసిన టీజ‌ర్ ఓ కార‌ణం. పెద్దగా పేరులేని హీరో, డైరెక్ట‌ర్ క‌లిసి చేసిన జార్జిరెడ్డి సినిమాకు మంచి హైప్ వ‌చ్చి ఓపెనింగ్స్ వ‌చ్చాయంటే అందుకు దాని ట్రైల‌ర్ కార‌ణం.

అందుకే టీజ‌ర్, ట్రైల‌ర్లు క‌ట్ చేసే విష‌యంలో చాలా జాగ్ర‌త్త ప‌డాలి. ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ బ‌లంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విష‌యం క్లాస్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌కు బాగానే అర్థ‌మైన‌ట్లుంది. అందుకే త‌న కొత్త సినిమా ల‌వ్ స్టోరి టీజ‌ర్ (ఫ‌స్ట్ కిక్)ను చాలా ఎఫెక్టివ్‌గా తీర్చిదిద్దాడు.

ప్రేమికుల దినోత్సవ కానుక‌గా రిలీజ్ చేసిన ల‌వ్ స్టోరి ఫ‌స్ట్ కిక్ ఇన్‌స్టంట్‌గా హిట్ట‌యింది. అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. శేఖ‌ర్ క‌మ్ముల మార్కు రొమాంటిక్ మూమెంట్స్ ప్రేక్ష‌కులకు ఆహ్లాదం పంచాయి. ఇక ఫ‌స్ట్ కిక్‌లో మిగ‌తా షాట్ల‌న్నీ ఒకెత్త‌యితే.. కొస‌మెరుపులా నిలిచిన లాస్ట్ షాట్ మ‌రో ఎత్తు. ఎవ‌రి ప్రేమ‌కూ నోచుకోని అబ్బాయికి అమ్మాయి హ‌ఠాత్తుగా ముద్దిచ్చేస‌రికి ఉద్వేగానికి గురై క‌న్నీళ్లు పెట్టుకునే షాట్లో నాగ‌చైత‌న్య హావ‌భావాలు చాలా హృద్యంగా అనిపించ‌గా.. ముద్దిస్తే ఏడుస్తారా అబ్బా అంటూ సాయిప‌ల్ల‌వి చెప్పిన డైలాగ్ వావ్ అనిపించింది. ఈ షాట్‌, ఆ డైలాగ్‌తో కొన్ని క్ష‌ణాల్లోనే శేఖ‌ర్ ప్రేక్ష‌కుల్లో మాయ‌లో ప‌డేశాడు.

ఇటు సెల‌బ్రెటీలు.. అటు సామాన్య ప్రేక్ష‌కులు అంద‌రూ.. ఈ షాట్ గురించి చ‌ర్చిస్తున్నారు. పొగిడేస్తున్నారు. సినిమా మీద ఒక్క‌సారిగా అంచ‌నాలు పెంచేసింది ఈ ఫ‌స్ట్ కిక్. ఫిదాకు ఏమాత్రం తీసిపోని ల‌వ్ స్టోరితో శేఖ‌ర్ మ‌రోసారి వెండితెర‌పై మ్యాజిక్ చేసేలాగే క‌నిపిస్తున్నాడు.Source link

Leave a Reply