కరణ్ జోహార్ ఇంట్లో మత్తు పార్టీపై NCB చర్యలు తీసుకోవాలి!

Movie NewsNCB should take action against Drink party at Karan Johar house

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మరణం పై దర్యాప్తు రకరకాల విషయాల్ని బయటకు తెస్తోంది. ఇక పాత గొడవల్ని కూడా కొత్తగా వైరల్ అవుతున్నాయి. మాజీ శిరోమణి అకాలీదళ్ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా బాలీవుడ్ సెలబ్రిటీల మాదకద్రవ్యాల వినియోగంపై సంచలన ఆరోపణలు చేస్తూ ఎన్.సి.బి ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయడం కలకలం రేపుతోంది.

కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన ఓ పార్టీ వీడియోపై ఇంతకుముందే ఆయన సంచలన ఆరోపణలు చేసారు. ఇప్పుడు అదే వీడియోని మరోసారి వైరల్ చేస్తూ.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు ఫిర్యాదు చేసారు సిర్సా. ఏడాది కాలంగా `డ్రగ్ పార్టీ` వీడియో వైరల్ అవుతూనే ఉందని.. ఆ పార్టీలో ఉన్న సెలబ్రిటీలపై దర్యాప్తు చేయమని ఏజెన్సీని కోరుతూ లేఖను రాశారు.

ఎన్.సి.బి చీఫ్ రాకేశ్ అస్తానాకు తన లేఖను పంచుకున్న సిర్సా.. ఆ వీడియోపై దర్యాప్తు ప్రారంభించమని కోరినట్లు చెప్పారు. “నేను సిర్సా.. ముంబైలోని కరణ్ నివాసంలో డ్రగ్ పార్టీని నిర్వహించారు. ఆయనపైనా పార్టీలో పాల్గొన్న ఇతరులపైనా దర్యాప్తు చేపట్టి చర్యల తీసుకోవాలని ఫిర్యాదును సమర్పించాను. దిల్లీలోని నార్కోటిక్స్ బ్యూరో బి.ఎస్.ఎఫ్ హెడ్ క్వార్టర్ చీఫ్ రాకేశ్ అస్థానా ఆ పార్టీ వీడియోను తప్పక దర్యాప్తు చేయాలి! ” అంటూ లేఖలో రాశారు.

ఆ లేఖకు సంబంధించిన అటాచ్డ్ స్క్రీన్షాట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీపికా పదుకొనే – విక్కీ కౌషల్- మలైకా అరోరా- వరుణ్ ధావన్- అర్జున్ కపూర్ -షాహిద్ కపూర్ అందరూ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారు. కరణ్ ఇంటి ప్రాంగణాన్ని నేరాల కోసం ఉపయోగించారని ఆ వీడియో చూపిస్తోంది“. పార్టీలో నటులు ‘డ్రగ్స్ సేవించడం’ కనిపించిందని సిర్సా తన లేఖలో పేర్కొన్నారు. అయితే పార్టీలో పాల్గొనేవారు మాదకద్రవ్యాలను వినియోగిస్తే దానిని వీడియోలో లైవ్ గా చూపిస్తారా?

ఆ వీడియో వైరల్ అయిన తర్వాత “తన పార్టీలో ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదని కరణ్ స్పష్టం చేశారు. “పరిశ్రమ సభ్యులు స్నేహితులు కష్టపడి పనిచేసిన వారం తర్వాత మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు అంతే. నేను ఆ వీడియోను చాలా శ్రద్ధగా తీసుకున్నది. ఏదైనా తప్పు జరుగుతుంటే నేను ఆ వీడియోను బయట పెడతానా? నేను తెలివితక్కువవాడిని కాదు కదా!“ అంటూ రాజీవ్ మసంద్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ స్వయంగా ఖండించారు.

“నా తల్లి గారు.. ఈ వీడియోకు 5 నిమిషాల ముందు మాతోనే ఉన్నారు. ఇది ఒక రకమైన కుటుంబం. సంతోషకర సందర్భమది. సామాజిక సమావేశం అనుకోవాలి. ఇక్కడ స్నేహితులు కూర్చుని మంచి సమయం గడిపారు. మేం సన్నని సంగీతం వింటున్నాము. మంచి ఆహారాన్ని తిన్నాం. మంచి సంభాషణలు జరుపుకున్నాం. ఇంకేమీ జరగడం లేదు అక్కడ ” అని కరణ్  చెప్పాడు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసుకు సంబంధించి ఎన్.సిబి ఇప్పటివరకు దాదాపు 20 మందిని అరెస్టు చేసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) నుండి అధికారిక సమాచార మార్పిడి  తరువాత సీబీఐ దర్యాప్తును ప్రారంభించింది. దీనిలో సుశాంత్ కేసుకు సంబంధించి మాదకద్రవ్యాల వినియోగం.. సేకరణ.. రవాణాకు సంబంధించిన వివిధ చాట్ లు బయటపడ్డాయి.Source link

www.tupaki.com

Leave a Reply