కలవర పెడుతున్న జాన్ కొత్త అప్ డేట్No Bollywood villains for Prabhas this time!

ప్రభాస్ సాహో చిత్రం విడుదలకు ముందే రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమాను మొదలు
పెట్టాడు. మొదట ఆ సినిమాకు జాన్ టైటిల్ అనుకున్నారు. సినిమా షూటింగ్
గత ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు ఈ
చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. గత ఏడాది ఈ సినిమా 2020
ఆరంభంలో వస్తుందని వార్తలు వచ్చాయి. 2020 వచ్చింది ఆరంభం కూడా అయిపోయింది.
రెండవ నెల కాదు కదా మూడవ నెలలో కూడా వచ్చే పరిస్థితి లేదు.

సినిమా
షూటింగ్ ముగింపు దశకు వచ్చి ఉంటుంది. సమ్మర్ లేదా ఆ తర్వాత దసరాకు అయినా
వస్తుందిలే అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ
సినిమాలో మెయిన్ విలన్ రోల్ కోసం జగపతిబాబును ఎంపిక చేసినట్లుగా వార్తలు
వస్తున్నాయి. సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిందనుకుంటే జగపతిబాబును
ఇప్పుడు ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయేంటి అంటూ ఫ్యాన్స్ గందర
గోళంలో ఉన్నారు.

షూటింగ్ ఏ దశలో ఉందనే విషయం పై క్లారిటీ
ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. జగపతిబాబు విలన్ పాత్రకు ఇప్పుడు ఎంపిక
అయ్యాడు అంటే సినిమా షూటింగ్ పార్ట్ ఇంకా సగానికి పైగా ఉన్నట్లే అని..
అదే నిజం అయితే ఈ ఏడాదిలో ఈ చిత్రాన్ని ఆశించడం కష్టమే అంటున్నారు.

ఇక
ఈ చిత్రానికి జాన్ కాకుండా ఓ డియర్ అనే టైటిల్ ను పెట్టేందుకు చర్చలు
జరుగుతున్నాయట. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్
లేకపోవడంతో ఫ్యాన్స్ పిచెక్కి పోతున్నారు. ప్రభాస్ కు జోడీగా ఈ చిత్రంలో
పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. కృష్ణంరాజు కూడా కీలక పాత్ర లో
కనిపించబోతున్నాడు. తెలుగు తో పాటు ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల
చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *