కుట్టి స్టోరీ తెలుగు వర్షన్ కు ఎన్టీఆర్



NTR To Become The Voice Of Vijay in Master

తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం ‘మాస్టర్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై తమిళ సినీ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మద్య కాలంలో విజయ్ ఏ సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. అందుకే ఈ సినిమా కూడా మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. తాజాగా ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు.

కుట్టి స్టోరీ అంటూ సాగే ఈ పాటను విజయ్ మరియు అనిరుధ్లు పాడారు. తమిళనాట ఈ పాట వైరల్ అవుతోంది. విజయ్ విభిన్నమైన వాయిస్ తో ఆకట్టుకునే రిధమ్ తో పాడాడు అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా కాన్సెప్ట్ ను కూడా తెలియజేసేలా ఈ పాట ఉండటంతో సినిమా పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.

తెలుగు వర్షన్ లో ఈ పాటను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాడివ్వబోతున్నారట. ఈ పాటను తెలుగులో పాడేందుకు ఇప్పటికే ఎన్టీఆర్ ఓకే చెప్పాడని.. త్వరలో ఆ పాట తెలుగు వర్షన్ ను రికార్డు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. విజయ్ సినిమా ప్రమోషన్ కు తెలుగులో ఎన్టీఆర్ పాట స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.



Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *