కుర్రహీరోకి గాళ్స్ అండర్ వేర్ లు పంపారట

Movie NewsNaveen Chandra Talking About His Female Fan Following

నాకోసం బట్టలు సర్ధుకుని హైదరాబాద్ వచ్చేసిన అమ్మాయిలు ఉన్నారు.. కొందరైతే అండర్ వేర్లు కానుకగా పంపారని చెప్పి షాకిచ్చారు కుర్ర హీరో నవీన్ చంద్ర. హైదరాబాద్ లో సెటిలైన ఈ బళ్లారి కుర్రాడు డెబ్యూ సినిమా తర్వాత తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చి షాకిచ్చారు.

అందాల రాక్షసి రిలీజైన తొలి రోజు తనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయిట. అందులో అమ్మాయిల కాల్స్ ఎక్కువ. ఫోన్ చేసి ఐలవ్ యు అని చెప్పి విసిగిస్తే చివరికి స్విచ్ఛాఫ్ చేసానని తెలిపాడు నవీన్. నా సైజ్ ఎలా తెలుసో కానీ అండర్ వేర్లు కానుకగా పంపారని వెల్లడించాడు.

అంతేకాదు.. ఒకమ్మాయి అయితే బట్టలు నగలు సర్ధుకుని హైదరాబాద్ కి వచ్చేసిందట. సికిందరాబాద్ లో ఫలానా హోటల్ రూమ్ నంబర్ కి రావాలంటూ సతాయించిందట. రాకపోతే ఏం జరుగుతుందో చెప్పలేను! అంటూ భయపెట్టేసిందట. మొత్తానికి గాళ్స్ లో ఆ రేంజులో క్రేజు తెచ్చుకున్నాడు తొలి సినిమాతోనే. ఇక గుబురు గడ్డంతో వీర ప్రేమికుడిగా నవీన్ చంద్ర నటనకు గొప్ప పేరొచ్చింది. అమీర్ పేట హాస్టల్ గాళ్స్ సైతం నవీన్ చంద్ర ప్రమోషన్స్ టైమ్ లో కిర్రెక్కిపోయారు. అదంతా సరే కానీ.. ఆర్.ఎక్స్ 100 సినిమాలో చేయాల్సింది ఈ హీరోనే. అజయ్ భూపతితో కలిసి నిర్మాత కోసం ట్రై చేసి వదిలేశాడు. చివరికి ఆ సినిమాని కార్తికేయ చేశాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు.Source link

www.tupaki.com

Leave a Reply