కోలుకోగానే ప్లాస్మా దానం చేస్తా: పాపులర్ సింగర్

Movie NewsDonate Plasma After Recovery: Popular Singer

ప్రముఖ సింగర్ స్మిత ఇటీవలే కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. తన భర్తతో
కలిసి ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంది. భార్యభర్తలు ఇద్దరు కరోనా కారణంగా
వారి కూతురుకి దూరంగా ఉండాల్సి వస్తుందని బాధపడుతున్నారు. ఇక తాజాగా తన
పాపను మిస్ అవుతున్నామని చెప్పిన స్మిత.. పలు విషయాలు మాట్లాడింది. ఆమె
మాట్లాడుతూ.. “నా భర్త నేను గత అయిదు నెలలుగా ఇంటివద్దే ఉంటూ పనులు
చేసుకుంటున్నాం. దేశంలో కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి అన్ని రకాల
జాగ్త్రతలు తీసుకుంటున్నాం. అయినా కూడా మాకు కరోనా పాజిటివ్ సోకింది. ఓ
రోజు నేను ఎక్కువ సేపు వ్యాయామం చేశాను. ఆ రోజంతా విపరీతమైన ఒళ్లు
నొప్పులు. అయితే వర్కవుట్ ఎక్కువ సమయం చేయడం వల్ల అలా ఉందేమో అనుకున్నా.
దానికి తోడు తొందరగా డీహైడ్రేట్ అవుతున్నట్టుగా అనిపించేది.

అనుమానంతో
కరోనా పరీక్ష చేయించున్నా. పాజిటివ్ వచ్చింది. అసలు ఎలా వచ్చిందంటే..
కొద్ది రోజుల క్రితం ఎలక్ట్రీషియన్ చిన్న పనిమీద మా ఇంటికి వచ్చాడు.
అతడికి కరోనా వచ్చిందని మాకు తరువాత తెలిసింది. వెంటనే మేము ముగ్గురం కరోనా
టెస్ట్ చేయించుకున్నాం. నాకు నా భర్తకు పాజిటివ్ వచ్చింది. మా కూతురు
శివికి నెగటివ్ వచ్చింది. మేమిద్దరం రెండు వారాలు ఐసోలేషన్లో ఉండేందుకు
రెడీగా ఉన్నాం. కానీ మా పాపకు దూరంగా ఉండడమే కష్టంగా అనిపిస్తుంది. కరోనా
వచ్చిన వాళ్లు 14 రోజుల పాటు స్వీయ నిర్భందంలో ఉండాలనే విషయం శివికి కూడా
తెలుసు. మాకు దూరంగా ఉండాల్సి రావడంతో తను కూడా బాధ పడుతుంది. తనని
చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో మా అమ్మ వచ్చి శివిని విజయవాడకు
తీసుకెళ్లింది.

మానసికంగా మేం స్ట్రాంగ్ గానే ఉన్నాం. మేము తొందరగా
కోలుకుంటామనే నమ్మకం నాకుంది. అప్పుడు నా కూతురును ఏ భయం లేకుండా దగ్గరికి
తీసుకుంటాను. ఇప్పుడు మా దృష్టంతా కరోనాను జయించడం మీదే ఉంది. రెండు వారాలు
క్వారంటైన్లో ఉండేందుకు రెడీ అయ్యాం. కరోనా నెగటివ్ వచ్చేంత వరకూ బయటి
ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాలనుకుంటున్నా. చెక్కుల సంతకాల కోసం మా
అసిస్టెంట్లును కూడా రావద్దని చెప్పాను. ఇప్పుడు మేమిద్దరం ధైర్యంగా ఉండడం
ఎంతో ముఖ్యం. తొందరగా కరోనాను జయించాలనే ఆలోచనతో ఉన్నా. కోలుకున్న తరువాత
ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నా” అంటూ చెప్పుకొచ్చింది స్మిత.
బయటికి వచ్చాక ప్లాస్మా దానం చేస్తానని చెప్పి ఆదర్శంగా నిలుస్తుంది స్మిత.Source link

Leave a Reply