క్యూట్ బ్యూటీ థై షోస్ లో ఎక్కడా తగ్గదుగా..!

Movie NewsTridha Choudhry Latest Stunning Pose

`సూర్య వర్సెస్ సూర్య` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది త్రిధా చౌదరి. నిఖిల్ లాంటి ఎనర్జిటిక్ హీరోతో పోటీపడి నటించింది. `మనసుకు నచ్చింది` అనే మరో చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత స్పైసీ కంటెంట్ ఉన్న సినిమాలతో యూత్ కి చేరువైంది. క్యూట్ లుక్స్ వేడెక్కించే వయ్యారం ఈ అమ్మడి సొంతం. అందుకే త్రిధా కి ప్రత్యేకించి ఫ్యాన్సున్నారు. ఈ భామ ఇటు సౌత్ తో పాటు అటు బాలీవుడ్ సినిమాలతోనే బిజీగా ఉంది. అక్కడ సీరియల్స్ చేసుకుంటూ బుల్లితెరపైనా వెలుగుతోంది.

స్పాట్ లైట్ అనే వెబ్ సిరీస్ తో త్రిధా పేరు ఇటీవల మార్మోగింది. ఈ సిరీస్ ఆద్యంతం వేడెక్కించే లిప్ లాక్ లతో త్రిధా హీట్ పెంచేసింది. ఫిలిం ఇండస్ట్రీ ఆఫర్ల కోసం ఎఫైర్ పెట్టుకునే కుర్ర హీరోయిన్ చుట్టూ తిరిగే కథాంశంతో హీట్ పెంచిన సిరీస్ ఇది. త్రిధా నటనకు పేరొచ్చింది. ఈ తరహా వెబ్ సినిమాలతో అటు ఉత్తరాది సహా ఇటు దక్షిణాదినా ఈ అమ్మడు పాపులారిటీ పెంచుకునే పనిలో ఉంది.

ఇక నటనతో పాటు స్టన్నింగ్ ఫోటోషూట్లు ఈ అమ్మడి ప్రత్యేకత. ఇటీవల సోషల్ మీడియాల్లో బికినీ ఫోటోషూట్స్ తో చెలరేగుతోంది. త్రిధా లేటెస్ట్ ఫోటో అంతే వైరల్ గా మారింది. బీచ్ వెకేషన్ లో ఉన్న త్రిధా గళ్ల టాప్ తో కవర్ చేసుకున్న తీరు ఆకట్టుకుంది. ఈ క్యూట్ బ్యూటీ థై షోస్ ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఇటీవల తెలుగులో ఆఫర్లు లేవు. ఇకనైనా కెరీర్ సెట్ రైట్ అవుతుందేమో చూడాలి.Source link

Leave a Reply