క్రేజీ అప్డేట్ : కొరటాల దర్శకత్వంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన బన్నీ…!Allu Arjun joins hands with Koratala Siva for his next

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరూ ఊహించినట్లుగానే వీరి కలయికలో సినిమా ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అల్లు అర్జున్ కెరీర్లో 21వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ తో కలిసి కొరటాల శివ ఫ్రెండ్ మిక్కిలినేని సుధాకర్ యువసుధ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దీనికి అల్లు అర్జున్ స్నేహితులు శాండీ – స్వాతి – నట్టి లు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

కాగా సామాజిక అంశాలతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రం రూపొందనుందని మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఆఫీసియల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ 2022న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఈ పోస్టర్ లో ఇద్దరు వ్యక్తులు నది ఒడ్డున నిలబడి అవతల ఒడ్డున ఉన్న ఊరిని చూస్తున్నట్లుగా డిజైన్ చేయబడింది. మొత్తం మీద ఈ సినిమా బన్నీ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు కొరటాల శివ మార్క్ మేసేజ్ కూడా ఉంటుందని అర్థం అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

ఇదిలా ఉండగా ఈ ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. ఈ క్రమంలో సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా చేస్తున్నాడు. మరోవైపు కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా కరోనా కారణంగా చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత బన్నీ – కొరటాల శివ కాంబోలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *