క్లాప్ కొట్టి మొదలెట్టిన RGV బయోపిక్ .. వివాదం జీరో!

Movie Newsbiopic on Ram Gopal Varma

వరుసగా ప్రముఖుల బయోపిక్ లు తీస్తూ వివాదాలతో హీటెక్కిస్తున్న ఆర్జీవీ సడెన్ గా తన జీవితకథని మూడు భాగాల బయోపిక్ ఫిలింగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించి బిగ్ షాకిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్జీవీ అభిమానులు పండగ చేసుకున్నా చాలామంది అతఃహశులయ్యారన్న గుసగుసా హీట్ పెంచింది.

తాజాగా ఆర్జీవీ అన్నంత పనీ అయ్యింది. ఆయన బయోపిక్ అధికారికంగా ప్రారంభమైంది. ముహూర్తం షాట్ కి ఆర్జీవీ సోదరి విజయ క్లాప్ కొట్టారు. ఇక ఆర్జీవీ కాలేజ్ డేస్ లో ఎలా ఉండేవాడో చూపించే షాట్ తో సినిమా మొదలెట్టారు. నూనూగుమీసాల కుర్రాడిగా ఈ మూవీ దర్శకుడు దొరసాయి తేజనే నటిస్తుండడం ఆసక్తికరం. `తొలి భాగం మొదలెట్టేశామోచ్!` అంటూ ఆర్జీవీ ట్వీట్ చేయడం ఆసక్తికరం.

బొమ్మాకు మురళి ఈ చిత్రానికి నిర్మాత. 20 ఏళ్ల కుర్రాడు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బయోపిక్ మూడు భాగాలుగా ఉంటుందని… మూడు సినిమాలు కలిపి 6 గంటల నిడివి ఉంటుందని ఆర్జీవీ ఇంతకుముందు వెల్లడించారు. ఫ్రాంఛైజీలో తొలి భాగం మొదలైంది. 2గంటల నిడివితో ఇది ట్రీటివ్వబోతుందన్నమాట. ఇందులో ఆర్జీవీ నూనూగు మీసాల బాలకుడిగా ఏం చేశారో చూపిస్తారట. అయితే పంజాగుట్ట సీడీల షాప్ ని చూపిస్తారా లేదా? ఆర్జీవీ కరాటే కిడ్ గా ఉన్న ఎపిసోడ్లు తెరకెక్కుతున్నాయా లేదా? అన్నది ఆసక్తికరం.Source link

www.tupaki.com

Leave a Reply