గల్లీ బోయ్ లా కన్ఫ్యూజ్ అవ్వకు సుప్రీం!

Movie NewsSai Dharam Marriage Proposal To Regina!?

2019 సెన్సేషనల్ హిట్ గల్లీ బోయ్ కి సుప్రీం హీరో సాయి తేజ్ కి ఏంటి సంబంధం? అంటే డీప్ గానే డీటెయిల్స్ లోకి వెళ్లాలి. ఓవైపు ఆలియా భట్ తో ప్రేమాయణం.. మరోవైపు ర్యాపర్ కం సింగర్ గా కెరీర్ కోసం పాకులాట.. ఇదీ గల్లీబోయ్ రణవీర్ సింగ్ పోరాటం. యూత్ కి పిచ్చిపిచ్చిగా నచ్చేసిన ఈ సినిమాలో అంత మ్యాటరేం ఉంది? అంటే కెరీర్ కి ప్రేమకు లింకు పెట్టి ర్యాప్ మ్యూజిక్ నేపథ్యంలో దర్శకురాలు జోయా అక్తర్ అత్యంత ప్రభావవంతంగా తెరకెక్కించడమే ఒక కారణం. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చిచ్చోరేకు ఇవ్వకుండా జాతీయ అవార్డ్ గల్లీ బోయ్ కే ఎందుకు ఇచ్చారు? అంటే సినిమా చూశాక మాట్లాడాల్సిందే. ఇప్పుడు ఈ సినిమా కథానాయకుడితో సాయి తేజ్ పోలిక సరితూగుతోంది.

మన మెగా హీరోని చూస్తే అతడిలోనూ అదే కన్ఫ్యూజన్ ఉన్నట్టే అర్థమవుతోంది. మెగా హీరో సాయి తేజ్ కొన్నేళ్ల క్రితం వరకు అందాల కథానాయిక రెజీనా కాసాండ్రాతో ప్రేమలో ఉన్నాడని ప్రచారమైంది. అయితే ఆ ఇద్దరూ తాము మంచి స్నేహితులు మాత్రమేనని అంతకుమించి ఏమీ లేదని తెలిపారు. తాజా ఇంటర్వ్యూలోనూ సాయి తేజ్ ఇదే విషయాన్ని ధృవీకరించాడు. రిలేషన్ లోకి ప్రవేశించే మానసిక స్థితిలో లేనని వెల్లడించాడు. ఒకవేళ ప్రేమలో ఉంటే కనీసం 75 శాతం సమయం దానికే కేటాయించాలి. నా వర్క్ షెడ్యూల్ కారణంగా నేను దానిని భరించలేను. ఇప్పుడున్న స్థితిలో నేను ప్రేమాయణాలకు సిద్ధంగా లేను అని సాయి తేజ్ అన్నారు.

అతడిని చూస్తుంటే కెరీర్ కి ప్రేమకు లింక్ పెట్టి చూస్తున్నట్టే అవగతం అవ్వడం లేదూ?  ప్రేమ వేరు.. కెరీర్ వేరు.. దేని పని దానిదేనని గల్లీబోయ్ లో చెప్పారు. మరి అది చూశాక అయినా సుప్రీం హీరో మారతాడంటారా?  సాయి తేజ్ ప్రస్తుతం తన మానసిక స్థితికి తగ్గట్టే `సోలో బ్రాతుకే సో బెటర్`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవా కట్టా ఈ మూవీతో తిరిగి రీబూట్ అవుతున్నాడు.Source link

Leave a Reply