గాల్వాన్ లోయ ఘర్షణపై మూవీ.. ఎవరా లక్కీ హీరో?Stalwart actor in a film on Indo China clashes?

భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో భారత సైన్యంతో చైనా సైన్యం(పీ.ఎల్.ఏ) ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. అక్కడ హింసాత్మక ఘర్షణల్లో 21 మంది భారత జవాన్లు సాహసికులు తమ ప్రాణాలను అర్పించారు. ఈ వార్ లో 40 మంది ప్రత్యర్థులను మన భారతీయ సైన్యం మట్టు బెట్టిందని అమెరికా పత్రికల్లో ప్రధానంగా హైలైట్ అయ్యింది. ఈ ఘటన మొత్తం భారత దేశాన్ని ఏకతాటి పైకి తెచ్చింది. చైనాకు వ్యతిరేక పోరు లో మోదీ ప్రభుత్వానికి ప్రజల నుంచి విపక్ష-ప్రతి పక్షాల నుంచి సపోర్ట్ దక్కింది. ఇప్పుడు ఈ ఘటన పై దేశ వ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో సినిమాల కు సన్నాహాలు చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్రముఖ మలయాళ నటుడు-దర్శకుడు మేజర్ రవి భారత-చైనా సరిహద్దు వివాదంపై `బ్రిడ్జ్ ఆఫ్ గాల్వన్` పేరుతో ఒక చిత్రాన్ని తాజాగా ప్రకటించారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలవుతుంది.

అయితే ఈ మూవీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మేజర్ రవి దేశభక్తి సినిమాల్ని తెరకెక్కించడంలో దిట్ట. ఇటీవల `1971: బియాండ్ బోర్డర్స్` అనే చిత్రాన్ని తెరకెక్కించారు. 1971 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం ఆధారంగా రూపొందించిన వార్ డ్రామా ఇది. మలయాళంలో విజయం సాధించింది. ఇంతకుముందు పాక్ తీవ్రవాదంపై వార్ నేపథ్యంలో విక్కీ కౌశల్ హీరోగా `ఊరి` తెరకెక్కి సంచలన విజయం సాధించింది. ఇప్పుడు గాల్వాన్ లోయలో ఘర్షణల్ని అంతే ఉద్విగ్నభరితంగా తెరకెక్కిస్తారా? అన్నది చూడాలి. ఇక ఈ మూవీలో మోహన్ లాల్ తో పాటు నటించే యంగ్ స్టార్లు ఎవరు?  పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తారా? అన్నది చూడాలి.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *