చార్టెడ్ ఫ్లైట్ లో అధీరా ఆకస్మిక పయనం దేనికి?

Movie NewsSanjay Dutt went to Dubai with his wife

బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ కు లంగ్ క్యాన్సర్ నాలుగో దశలో ఉన్న విషయం ఇంతకుముందు బయటపడిన సంగతి తెలిసిందే. ఆ వార్తతో బాలీవుడ్ సహా సౌత్ లోనూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ముఖ్యంగా `కేజీఎఫ్- చాప్టర్ 2` టీమ్ తీవ్ర ఆందోళనకు గురైంది.  సంజయ్‌దత్ `కేజీఎఫ్` ఫ్రాంచైజీ లో అధీరాగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ మరో 20 శాతం బ్యాలెన్స్ ఉండగా ఆ వార్త తెలిసింది. దత్ విదేశాలకు ట్రీట్ మెంట్ కి వెళ్లగా..  ఇటీవల ప్రకాష్ రాజ్ పై కీలక సన్నివేశాల షూటింగ్ ని పునః ప్రారంభించారు.

సంజయ్‌దత్ కు ఇప్పటికే తొలి రౌండ్ కీమోథెరపీ పూర్తయింది. మరో రౌండ్ ట్రీట్ మెంట్ కి మరింత సమయం వుండటంతో ముంబై వదిలి బయటికి వెళ్లాలని సంజయ్ దత్ అతని భార్య మాన్యత నిర్ణయించుకున్నారు. ఇందు కోసం దుబాయ్ వెళ్లబోతున్నారు. కరోనా వైరస్ కారణంగా సంజయ్ పిల్లలు ఇక్రా అండ్ షహ్రాన్ దుబాయ్ లో స్ట్రక్కయ్ పోయారు. వారిని కలవడంతో పాటు అక్కడే యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న `శంషేరా` చిత్రంలో నటిస్తారట.

రెండవ రౌండ్ కీమోథెరపీకి ముందు ఫ్యామిలీతో గడపాలని సంజయ్ నిర్ణయించుకున్నారట. ఆ కారణంగానే భార్య మాన్యతతో కలిసి దుబాయ్ పయనమయ్యారట. సంజయ్ పిల్లలు లాక్ డౌన్ లో దుబాయ్ లో లాకై ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. వారిని ఓ సారి చూసుకుని మళ్లీ సెకండ్ ట్రీట్ మెంట్ కి ముంబై రానున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ ని బుక్ చేసుకున్నారు. ఇదిలా వుంటే కేజీఎఫ్ చాప్టర్ 2.. `శంషేరా` చిత్రాలతో పాటు సంజయ్‌దత్ తోర్బాజ్.. భుజ్ : ప్రైడ్ ఆఫ్ ఇండియా.. పృథ్విరాజ్ చిత్రాల్లో నటిస్తున్నారు.Source link

www.tupaki.com

Leave a Reply