చావు కబురు చల్లగా.. అసలు మ్యాటర్ ఇదన్నమాట

Movie Newsచావు కబురు చల్లగా.. అసలు మ్యాటర్ ఇదన్నమాట

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఓవర్ నైట్ సూపర్ పాపులారిటీ సంపాదించిన యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మ‌కొండ‌. ఐతే ఆ సినిమాతో వ‌చ్చిన పాపులారిటీని అత‌ను ఉప‌యోగించుకోలేక‌పోయాడు. ఏడాది వ్య‌వ‌ధిలో మూడు సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేశాడు కానీ.. వాటిలో ఒక్క‌టీ మంచి ఫ‌లితాన్నివ్వ‌లేదు. హిప్పి, గుణ 365, 90 ఎంఎల్.. ఒక‌దాన్ని మించి ఒక‌టి ఫ్లాప్ అయ్యాయి. విల‌న్ పాత్ర‌లో న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్ కూడా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు.

ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా కింద ప‌డ్డ కార్తికేయ‌.. మ‌ళ్లీ ఓ బ్రేక్ కోసం చూస్తున్నాడు. ఆ బ్రేక్ ఇస్తుంద‌ని ఆశిస్తున్న సినిమా.. చావు క‌బురు చ‌ల్ల‌గా. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేన‌ర్లో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. ఈ బేన‌ర్లో న‌టించాల‌న్న క‌ల‌ను చాలా త్వ‌ర‌గానే నెర‌వేర్చుకుంటున్నాడు కార్తికేయ‌.

కౌశిక్ పెగ‌ల్ల‌పాటి అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందిందిస్తున్నాడు. అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాలో బ‌స్తీ బాల‌రాజు అనే ఫ‌న్నీ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు కార్తికేయ‌. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ తాజాగా లాంచ్ చేశారు. స్వ‌ర్గ‌పురి వాహ‌న‌ము అని రాసి ఉన్న వ్యాన్ మీద కార్తికేయ నిల‌బ‌డి ఉన్నాడు. దీన్ని బ‌ట్టి చ‌నిపోయిన వ్య‌క్తుల్ని ఊరేగింపుగా తీసుకెళ్లే వ్యాన్ న‌డిపే డ్రైవ‌ర్ పాత్ర‌లో కార్తికేయ క‌నిపించ‌నున్నాడ‌న్న‌మాట‌.

ఈ సినిమాకు చావు క‌బురు చ‌ల్ల‌గా అనే టైటిల్ అని ఎందుకు పెట్టార‌న్న‌ది ఈ ఫ‌స్ట్ లుక్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఫ‌స్ట్ లుక్‌ను బ‌ట్టి ఇది కామెడీ ఎంట‌ర్టైన‌ర్ అనే సంగ‌తీ స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇందులో లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. కార్తికేయ కెరీర్‌కు చాలా కీల‌క‌మైన ఈ సినిమాతో అత‌డికి కొత్త ద‌ర్శ‌కుడు ఎలాంటి ఫ‌లితాన్నిస్తాడో చూడాలి.Source link