చివరికి అమితాబ్ బచ్చన్ ని గొడవలోకి లాగారు

Movie NewsEventually Amitabh Bachchan was dragged into the fray

సుశాంత్ సింగ్ రకారాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు దేశ వ్యాప్తంగా వున్న
యువతలో ఫ్రస్ట్రేషన్ ని ఓ వేవ్ లా బయటికి తీసుకొస్తోంది. ఈ కేసు
రోజు రోజుకీ ఆలస్యం అవుతుండటం.. భయానక విషయాలు బయటికి వస్తుండటంతో
దేశ వ్యాప్తంగా చాలా మందిలోనూ అసహనం ఆగ్రహం పెల్లుబికుతోంది. అదొక
దావానలంగా మారి బాలీవుడ్ సెలబ్రిటీలని దహించబోతోంది. ఇప్పటికే
పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలని ఈ కేసు వియంలో నెటిజన్స్ సోషల్ మీడియా
వేదికగా ఏకిపారేశారు.

ఈ ట్రోలింగ్ ఎంత వరకు వెళ్లిందంటే
సాక్ష్యాత్తు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని కూడా ఈ
వివాదంలోకి లాగి బూతులు తిడుతుండటం సంచలనంగా మారింది. అమితాబ్ ఫొటోని
షేర్ చేస్తూ ఆ ఫొటోపై యానాయక్ నహీ మహానాలాయక్ అనే హ్యాష్ ట్యాగ్ తో
బిగ్బీని ట్రోల్ చేస్తున్నారు. సుశాంత్ మృతి విషయంలో ఇంకా మౌనంగా
వుంటున్నందుకు అమితాబ్ ని ఓ రేంజ్ లో తిడుతూ నెటిజన్స్ హద్దులు
దాటేస్తుండటం ప్రమాదకరంగా మారింది.

అయితే దీనికి జాతీయ మీడియా
కూడా ఆజ్యం పోస్తుండటంతో చాలా మంది సెలబ్రిటీలు ట్రోలింగ్ కి గురవుతూ
ఒత్తిడికి గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా దేశ వ్యాప్తంగా వున్న యువత
ఏది మంది ఏది చెడు అని గుర్తించలేకపోతున్నారు. ద్వేషం… అసహనం అనే
ముసుగులో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నటుడిని అసభ్యపదజాలంతో దూషించే
స్థాయికి దిగజారామంటే దానికి సోషల్ మీడియా… ప్రసార మాధ్యమాలు కూడా
ప్రధాన భూమికను పోషించాయన్నది ఇక్కడ నిర్వవాదాంశం. సుశాంత్ కేసు తేలే
వరకు ఈ అసహనం… ద్వేషం ఏ స్థాయికి చేరుకుంటాయో ఊహకందడం లేదని
విశ్లేషకులు అంటున్నారు.Source link

www.tupaki.com

Leave a Reply