జబర్దస్త్ టీం ‘ముక్కు’ పిండి వసూళ్లు చేసిందంట

Movie NewsAnother wild card entry in Bigg Boss house

జబర్దస్త్ నిర్మాణ సంస్థ మల్లెమాల పై మాజీ జబర్దస్త్ కమెడియన్స్ పలు విషయాల్లో విమర్శలు చేశారు. నాగబాబు జబర్దస్త్ నుండి బయటకు వెళ్లిన సమయంలో మల్లెమాల వారిని సున్నితంగా విమర్శించారు. ఒక వైపు వారి వల్లే ఎంతో మందికి మంచి జరిగింది అంటూనే వారి వ్యాపార దోరణిని విమర్శించారు. ఒకసారి కమెడియన్స్ వారితో అగ్రిమెంట్ చేసుకుంటే మధ్యలో వెళ్లి పోవాలంటే భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. వారు తొలగిస్తే మాత్రం ఎలాంటి పరిహారం లేకుండానే పంపించేయవచ్చు. అందుకే అదిరింది కామెడీ షో లో పాల్లొనేందుకు చాలా మంది జబర్దస్త్ కమెడియన్స్ ఆసక్తి చూపించినా కూడా మల్లెమాల వారితో ఉన్న ఒప్పందం కారణంగా ఎటు వెళ్లలేని పరిస్థితి. తాజాగా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ మల్లెమాల వారితో ఉన్న అగ్రిమెంట్ ను బ్రేక్ చేశాడట.

బిగ్ బాస్ లో పాల్గొనేందుకు అవినాష్ జబర్దస్త్ టీంకు విజ్ఞప్తి చేశాడట. కాని అగ్రిమెంట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సిందే అన్నారట. స్టార్ మా వారు కూడా బిగ్ బాస్ లో ఉండాలంటే ఆ అగ్రిమెంట్ విషయంలో క్లారిటీ తెచ్చుకోవాలని సూచించారట. వారి నుండి క్లియరెన్స్ రావాలంటే ముందుగా ఒప్పందం చేసుకున్న దాని ప్రకారం నష్టపరిహారం చెల్లించాల్సిందే అన్నారట. దాంతో మల్లెమాల వారికి అవినాష్ ఆ మొత్తం చెల్లించి బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు అంటూ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మల్లెమాల వారితో ఉన్న అగ్రిమెంట్ కారణంగానే అవినాష్ ఎంట్రీ ఆలస్యం అయ్యిందట. లేదంటే అందరితో పాటు మొదటి రోజే ఎంట్రీ ఇచ్చేవాడు అంటూ బుల్లి తెర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మల్లెమాల వారి తీరు మరీ ఇంత కఠినంగా ఉంటుందా అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. మరి ఈ విమర్శలపై మల్లెమాల వారు ఎలా స్పందిస్తారో చూడాలి.Source link

www.tupaki.com

Leave a Reply