‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ బైట్ వచ్చేస్తోంది..!

Movie News'Zombie Reddy' first bite is coming ..!

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ”జాంబీ
రెడ్డి”. ‘అ!’ ‘కల్కి’ వంటి విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక
గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. ఈసారి జాంబీ నేపథ్యాన్ని
ఎంచుకున్నాడు. ఈ చిత్రంతో తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతుండగా.. ఆనంది
హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘జాంబీ రెడ్డి’ చిత్రానికి
సంబంధించిన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కోవిడ్ నేపథ్యంలో
చివరి షెడ్యూల్ ప్రారంభించిన చిత్ర యూనిట్.. టాకీ పార్ట్ మొత్తం పూర్తి
చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ
క్రమంలో ‘జాంబీ రెడ్డి’ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్న చిత్ర యూనిట్ ‘ఫస్ట్
బైట్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

డిసెంబర్ 5న ‘జాంబీ
రెడ్డి’ ఫస్ట్ బైట్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది
జాంబీ కథాంశంతో టాలీవుడ్ లో వస్తున్న మొట్ట మొదటి సినిమా. కర్నూల్
బ్యాగ్రౌండ్ లో వస్తున్న ఈ ఫిక్షనల్ జాంబీ తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి
అనుభూతిని కలిగిస్తుందో చూడాలి. ఈ చిత్రానికి స్క్రిప్ట్స్ విల్లే
స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. అనిత్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్
చేస్తున్నాడు. మార్క్ కె.రాబిన్ సంగీతం సమకూరుస్తున్నాడు. సాయిబాబు ఎడిటర్
గా వ్యవహరిస్తున్నారు. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ‘జోంబీ రెడ్డి’
చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ బైట్ తో ఏమి
చూపిస్తారో తెలియాలంటే డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే.Source link

www.tupaki.com