టవల్ జార్చిన సింహబలుడు



John Abraham In New Look

బాలీవుడ్ లో ఎందరు హీరోలు ఉన్నా జాన్ అబ్రహాం స్టైలే వేరు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సింహబలుడి ఆకారంతో మగువల గుండెల్లో గుబులు రేకెత్తించే హీరోగా తనకంటూ ఓ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఇంతకుముందు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఫోర్స్ (ఘర్షణ రీమేక్) చిత్రంలో నటించి ఆకట్టుకున్న జాన్ బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించాడు.

తాజాగా జాన్ అబ్రహాం లేటెస్ట్ ఫోటో సెన్సేషన్ అయ్యింది. 47 ఏళ్ల ఏస్ లెన్స్ మాన్ డబూ రత్నాని 2020 క్యాలెండర్ పై జాన్ ఇచ్చిన ఫోజు ప్రస్తుతం ప్రకంపనాలు రేపుతోంది. ఆ ఫోటోలో ఒక తెల్లటి టవల్ తప్ప అతడి ఒంటిపై మరో ఆచ్ఛాదన అన్నదే లేదు. ఆ టవల్ కూడా జారిపోతుంటే చేత్తో పట్టుకుని కనిపించాడు. ఒక రకంగా ఇది టెంప్టింగ్ స్టిల్ అనే చెప్పాలి. ఈ ఫోటోలో సిక్స్-ప్యాక్ యాబ్స్  ని ఎలివేట్ చేయడమే గాక మెలితిరిగిన కండల్ని జాన్ ప్రదర్శించాడు. ఒకరకంగా జాన్ కండ పుష్టికి పూర్తి న్యాయం చేసేలా ఈ ఫోటోని డిజైన్ చేశాడనే చెప్పాలి.

2003 లో ‘జిస్మ్’ చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టక ముందు జాన్ ఒక సాధారణ మోడల్. ఇదిగో ఈ ఫిట్ బాడీనే అతని ఆస్తి. సినిమా ఛాన్సులు తెచ్చింది కూడా అదే. ధూమ్ – దేశీ బోయ్జ్ వంటి చిత్రాలతో అతడి స్థాయి పెరిగింది.  మద్రాస్ కేఫ్ – పరమాణు వంటి చిత్రాలను నిర్మించి వాటిలో హీరోగా నటించాడు. రేస్ 2 – వెల్కమ్ బ్యాక్ వంటి కమర్షియల్ చిత్రాలు అతడికి నటుడిగా గుర్తింపును తెచ్చాయి. ప్రస్తుతం రాకుల్ ప్రీత్ తో కలిసి యాక్షన్ థిల్లర్ ‘ఎటాక్’లో .. అలాగే బ్లాక్ బస్టర్ ‘సత్యమేవ జయతే’ సీక్వెల్ లోనూ అతడు నటిస్తున్నాడు. కరణ్ జోహార్ ‘దోస్తానా’ సిరీస్ తో నటుడిగా గుర్తింపు దక్కినా.. ఆ సిరీస్ లో ఇప్పుడు అతడు కొనసాగడం లేదు.



Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *