ట్రెండీ టాక్: అప్సరసలకే కన్ను కుట్టేలా హీరో గారి వైఫ్

Movie NewsMiheeka Bajaj Latest Instagram Post Goes Viral

టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి స్నేహితురాలు మిహీకా బాజాజ్ తో ప్రేమలో వున్నానని తొలిసారి సోషల్ మీడియా వేదికగా ప్రకటించి షాకిచ్చాడు. అప్పటి వరకు మిహీకా అంటే ఎవరికీ తెలియదు. ఆమె ముంబైలో ఓ ఆవెంట్ మేనేజ్మెంట్ సంస్థని రన్ చేస్తోందని ఆమెకూ ఫేజ్ 3 ప్రపంచంలో గొప్ప పాపులారిటీ ఉందని తెలిసింది కొద్దిమందికే. రానా కాబోయే యువతిగా.. ఆ తరువాత ఒక్కసారిగా మిహీకా వార్తల్లో నిలిచింది. ఇలా ప్రకటించి అలా వెంటనే పెళ్లిని పట్టాలెక్కించేందుకు ఏమాత్రం ఆలస్యం చేయలేదు రానా. ఈ ముచ్చటైన జంట వివాహం ఆగస్టు 8న జరిగిన విషయం తెలిసిందే. నవదంపతుల అందచందాలు ఒడ్డు పొడుగు పెళ్లి వేదిక సాక్షిగా చర్చకొచ్చాయి. మిహీక అందచందాల గురించి యువతరం గట్టిగానే చర్చించుకున్నారు.

పెళ్లికి ముందు పెళ్లి తరువాత అందరి దృష్ఠిని ఆకర్షించిన మిహీకా తాజా మరోసారి అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మిహీకా షేర్ చేసింది. ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ డిజైన్ చేసిన సారీని ధరించి తన ఇంటి బాల్కనీలో ఇచ్చిన స్టన్నింగ్ పోజు వైరల్ గా మారింది. డైమండ్ ఇయర్ రింగ్స్.. నాజూకు నడుముకి అలంకరణగా డిజైన్డ్ బెల్ట్.. త్రెడ్ వర్క్ తో హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన  సారీ డిజైన్ లో మిహీకా అప్సరసలా మెరిసిపోతోంది. అందాల కథానాయికలు .. దేవతా కన్యకలకైనా కన్ను కుట్టాల్సిందే ఈ అందాన్ని చూశాక. ఆరడుగుల బుల్లెట్టులా ఆకాశహార్మ్యం నుంచి మిహీక ఇచ్చిన ఈ ఫోజు అంతర్జాలంలో వైరల్ గా మారింది.

ఆగస్టు 8న జరిగిన రానా – మిహీకాల వెడ్డింగ్ కి చిత్ర పరిశ్రమకు చెందిన అతి కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. అందులో రామ్ చరణ్.. అల్లు అర్జున్.. సమంత.. నాగచైతన్య వంటి కొంత మంది దగ్గు బాటి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా వున్న కుటుంబాలు మాత్రమే ఈ వివాహ వేడుకలో పాల్గొన్నాయి.Source link

www.tupaki.com

Leave a Reply